బాలయ్య సినిమాకూ శాలరీ కట్

కరోనా టైమ్ లో నిర్మాతలు చేష్టలుడిగి కూర్చున్నారు. సినిమాల నిర్మాణం ఆగిపోయింది. ఆఫీసు ఖర్చులను సగానికి సగం కోత పెట్టుకున్నారు. స్టాఫ్ జీతాలు సగం చేసారు. సినిమా నిర్మాణంలో లేదు కాబట్టి ఖర్చు వుండదు.…

కరోనా టైమ్ లో నిర్మాతలు చేష్టలుడిగి కూర్చున్నారు. సినిమాల నిర్మాణం ఆగిపోయింది. ఆఫీసు ఖర్చులను సగానికి సగం కోత పెట్టుకున్నారు. స్టాఫ్ జీతాలు సగం చేసారు. సినిమా నిర్మాణంలో లేదు కాబట్టి ఖర్చు వుండదు. అయితే డైరక్షన్ డిపార్ట్ మెంట్ జీతాలు మాత్రం నిర్మాత భరించాలి. 

ఇప్పటికే నిర్మాణంలో వున్న సినిమాల డైరక్షన్ డిపార్ట్ మెంట్ ఖర్చులు కొంత మంది కోసారు. కొంతమంది భరిస్తున్నారు. ఇటీవల వరకు ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా సగం జీతాలు ఇచ్చిందని, ఇప్పుడు ఈనెల నుంచి పూర్తిగా నిలిపివేసిందని వార్తలు వినవచ్చాయి.

ఇదిలా వుంటే బోయపాటి-బాలయ్య సినిమా సంస్థ కూడా సగానికి సగం జీతాలే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈమేరకు మీటింగ్ పెట్టి, డైరక్షన్ డిపార్ట్ మెంట్ మెంబర్లకు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి క్లారిటీగా చెప్పేసినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణం మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. కానీ వచ్చే నెలలో మొదలైనా, ఆరు నెలల తరువాత మొదలైనా సరే, యాభై శాతం జీతాలు మాత్రం ఇస్తానని ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సుకుమార్ పుష్ప టీమ్ లో కొద్ది మందికి మాత్రమే జీతాలు ఇస్తున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. దాదాపు మిగిలిన బ్యానర్లు కూడా ఇదే ప్యాట్రన్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు