బాలీవుడ్ లో ప్రభాస్ భారీ మల్టీస్టారర్?

రాధేశ్వామ్, నాగ్ అశ్విన్ సినిమాల తరువాత బాహుబలి ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయిందని 'గ్రేట్ ఆంధ్ర' వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కు డైరక్టర్ గా తానాజీ సినిమా అందించిన…

రాధేశ్వామ్, నాగ్ అశ్విన్ సినిమాల తరువాత బాహుబలి ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయిందని 'గ్రేట్ ఆంధ్ర' వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కు డైరక్టర్ గా తానాజీ సినిమా అందించిన ఓమ్ రౌత్ ఈ ప్రాజెక్టు కు సారథ్యం వహించే అవకాశం వుందన్న సంగతీ తెలిసిందే.

ఇప్పుడు కొత్త అప్ డేట్ ఏమిటంటే, ఈ ప్రాజెక్టును భారీ మల్టీ స్టారర్ గా రూపొందించే అవకాశాలు పరిశీలనలో వున్నాయని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా ఈ ప్రాజెక్టులో వుండే అవకాశం వుందని తెలుస్తోంది.  అంటే ఇటు ప్రభాస్ అటు హృతిక్ రోషన్ అంటే ప్రాజెక్ట్ మీద క్రేజ్ మామూలుగా వుండదు. 

ఇదిలా వుంటే ప్రభాస్ బాలీవుడ్ కు వెళ్లిపోతే, మరి తెలుగు నిర్మాతల పరిస్థితి ఏమిటి? అని డిస్కషన్లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ లు ఇచ్చిన మైత్రీ, దిల్ రాజు ల సంగతేమిటి? అని టాక్ నడుస్తోంది. మైత్రీ నిర్మాతలకు డైరక్టర్ ఎవ్వరూ రెడీ లేకపోవడమే కారణం అని సమాధానం కూడా వినిపిస్తోంది. అలాగే దిల్ రాజు దగ్గర కూడా పెద్ద డైరక్టర్లు ఎవ్వరూ రెడీగా లేరు. బహుశా అందుకే ప్రభాస్ బాలీవుడ్ రూటు ఎంచుకుని వుంటాడేమో?

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు