బాలయ్య సినిమాకు అనూప్?

నాగ్ తో మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఎన్టీఆర్ తో టెంపర్, పవన్ తో కాటమరాయుడు చేసిన అనూప్ ఇప్పుడు మరో పెద్ద సినిమాకు సైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య-పూరి కాంబినేషన్ లో స్టార్ట్…

నాగ్ తో మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఎన్టీఆర్ తో టెంపర్, పవన్ తో కాటమరాయుడు చేసిన అనూప్ ఇప్పుడు మరో పెద్ద సినిమాకు సైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య-పూరి కాంబినేషన్ లో స్టార్ట్ అయిన సినిమాకు అనూప్ ను మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు పూరితో టెంపర్, ఇజమ్, హార్ట్ ఎటాక్ సినిమాలకు అనూప్ పనిచేసాడు. బాలయ్య సినిమా నిర్ణయాలు మొత్తం పూరి చేతిలో పెట్టడంతో ఆయన అనూప్ నే ఛూజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మ్యూజిక్ డైరక్టర్ ఎవరైనా కాస్త మంచి వర్క్ నే రాబట్టుకుంటాడు పూరి. పైగా ఈ సినిమా బడ్జెట్ లో ఫినిష్ కావాలి. పూరి రెమ్యూనిరేషన్ తో కలిపి 25 కోట్లు. అంటే సినిమాకు మిగిలే బడ్జెట్ ఎంత? అందుకే దేవీ, థమన్ లాంటి భారీ మ్యూజిక్ డైరక్టర్ల జోలికి వెళ్లకుండా అనూప్ దగ్గరే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.