ఇది స్మార్ట్‌ఫోన్ యుగం… స్మార్ట్‌ఫోన్‌తోనే ఆనందం అంతా.. మరి ఇతర ఆనందాలను కూడా స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కించడమే మరింత ఆనందం. టూరిస్టు ప్లేస్‌కు పోతే.. డైరెక్టుగా ఆ ప్రదేశాన్ని చూడటంకన్నా, అక్కడున్నంత సేపూ ఫోన్లో వీడియో తీయడానికే మన ప్రాధాన్యత ఎక్కువ. మరి శృంగారం దగ్గరకు వచ్చే సరికి కూడా ఇదే తీరునే అనుసరించడం పెరుగుతోంది జనాల్లో. దీంతో ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి తీరుతో సెలబ్రిటీలు పడుతున్న ఇబ్బందిని గమనించి అయినా.. మిగతా వాళ్లు పాఠాలు నేర్చుకోవాలంటున్నారు నిపుణులు.
ప్రేమలో పరిధి దాటి రొమాన్స్ చేసుకునే వాళ్లలో, సెక్స్ కోసం పరితపిస్తున్న యూత్‌లో, కొత్తగా పెళ్లైన వాళ్లలో ఇలాంటి ధోరణి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రేమించుకున్న టీనేజర్లలో తమ రొమాన్స్‌ను మళ్లీ మళ్లీ చూసుకోవడానికి అన్నట్టుగా లేదా ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకునే ధోరణితో అయినా రొమాన్స్‌ను స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించుకోవడం అలవాటుగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి ఫొటోలను కుర్రాళ్లు అంత తేలికగా డిలీట్ చేయరు కూడా. అమ్మాయిలు కూడా ప్రేమలో ఉన్నప్పుడు సర్వం మరిచిపోయి ముద్దులాటల చిత్రీకరణలకు ఓకే చెబుతారు. తీరా.. వారి బంధం బెడిసికొట్టినప్పుడు, ఇలాంటి ఫొటోలు వేరే వాళ్ల చేతుల్లో పడినప్పుడు అసలు కథ మొదలవుతుంది.
ఇక సెక్స్ కోసం తపిస్తున్న వారిలో కూడా ఈ ధోరణి ఉందని నిపుణులు చెబుతున్నారు. వారు ప్రేమికులు కావొచ్చు, అక్రమ సంబంధమో, సక్రమ సంబంధమో కావొచ్చు.. దూరదూరంగా ఉన్నప్పుడు లైంగింకావయవాల ఫొటోలు తీసుకుని పంపించుకుని రెచ్చగొట్టుకునే ధోరణి ఉందని అంటున్నారు. ఇలాంటి సెక్స్టింగ్ అత్యంత ప్రమాదకరమైనదని కూడా వేరే చెప్పనక్కర్లేదు.
ఇక కొత్తగా వివాహం అయిన దంపతుల్లో కూడా ఈ ధోరణి ఉందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ముచ్చట్లను స్మార్ట్‌ఫోన్‌లో బంధించుకోడం ఒక సరదా. ఆ సరదా కొద్దీ చేసినా.. తగు సమయంలో వాటిని డిలీట్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో చెప్పనక్కర్లేదు. అందునా.. ఇంటర్నెట్తో అనుసంధానం అయి ఉంటాయి స్మార్ట్ఫోన్లు. ఫొటోలు తీయగానే.. వాటిని సేవ్ చేసుకునే అప్లికేషన్లు కూడా కొన్ని ఉన్నాయి. వాటి వల్ల ఫోన్లో డిలీట్ చేసినా.. ఆ యాప్స్‌లో ఫొటోలు సేవ్ అయ్యుండే అవకాశం ఉంది. వాటి విషయంలో కూడా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా.. సెక్స్టింగ్ చాలా ప్రమాదకరం.. శృంగార స్పందనలను ఫోన్‌తో షేర్ చేసుకోవడంతో ఎలాంటి ప్రమాదాలు అయినా ముంచుకురావొచ్చు. లీక్ అవుతున్న సెలబ్రిటీల శృంగార వ్యవహారాలు ఈ సందేశాన్నే ఇస్తున్నాయి.