నరసింహా..అన్నా సింహా అన్నా బాలయ్య బాబుకు పూనకం వచ్చేస్తుంది. ఆ పదాలు అంటే అంత ఇష్టం.పైగా అచ్చి వచ్చాయి కూడా. అందుకే ఇప్పుడు తన తాజా సినిమాకు లయన్ అన్న పేరు పెట్టమని అడుగుతున్నాడట. కానీ అక్కడే అసలు చిక్కు వచ్చిపడింది.
Advertisement
ఆ టైటిల్ ఏమో ఎవరో రిజిస్టర్ చేసి పెట్టుకున్నారట. అడిగితే ఇవ్వడం లేదట..డబ్బు ఇస్తామన్నా కాదంటున్నారట. పోనీ వారియర్..అనే టైటిల్ కూడా వీరోచితం గానే వుంటుంది కదా..అంటే అబ్బే..లయన్ బెటర్..పైగా అది నా సెంటిమెంట్ కూడా అంటున్నారట బాలయ్య. ఎలాగైనా టైటిల్ హొల్డర్ లను ఒప్పించాలని కిందామీదా పడుతున్నరట బాలయ్య సినిమా నిర్మాతలు.