స్పైస్ జెట్ తో లబోదిబో

స్పైస్ జెట్ సమస్యలు ప్రయాణీకుల సమస్యలుగా మారిపోతున్నాయి. ఈ రోజు బెంగుళూరు మీదుగా వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానాలు, అక్కడి విమానాశ్రయంలో లాండ్ కాగానే, తిరిగి ఇంధనం నింపడం మానేసారు. పాతబకాయిలు చెల్లిస్తేనే ఇంధనం…

స్పైస్ జెట్ సమస్యలు ప్రయాణీకుల సమస్యలుగా మారిపోతున్నాయి. ఈ రోజు బెంగుళూరు మీదుగా వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానాలు, అక్కడి విమానాశ్రయంలో లాండ్ కాగానే, తిరిగి ఇంధనం నింపడం మానేసారు. పాతబకాయిలు చెల్లిస్తేనే ఇంధనం అని అక్కడి అధికారులు చెప్పేసారు. 

దాంతో బెంగుళూరు మీదుగా మంగుళూరు, ముంబై, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలన్నీ అక్కడే నిలిచిపోయాయి. దాంతో ప్రయాణీకులు ఆందోళన సాగిస్తున్నారు. ఏం చేయాలో తోచక విమానాశ్రయ సిబ్బంది కిందా మీదా అవుతున్నారు. ఎలా వెళ్లాలో తెలియక ప్రయాణీకులు సతమతమవుతున్నారు. 

ఇక కొన్నాళ్ల పాటు స్పైస్ జెట్ విమానాల టికెట్ లు కొనడం ఆపితే బెటరేమో?