చెక్ బౌన్స్ కేసులు సినీ నటి, దర్శకురాలు జీవితకు దెబ్బ మీద దెబ్బ కొడ్తున్నాయి. మొన్నామధ్య ఓ కేసులో రెండేళ్ళ జైలు, యాభై లక్షల జరిమానాను న్యాయస్థానం విధించిన విషయం విదితమే. డబ్బును న్యాయస్థానంలో డిపాజిట్ చేశారు కూడా. అంతలోనే మరో కేసు ఆమె నెత్తిన పిడుగులా పడింది. ఈసారీ ఈ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్‌ని జారీ చేసింది న్యాయస్థానం.
తనకు జీవిత ఇచ్చిన పాతిక లక్షల రూపాయల చెక్ బౌన్స్ అయ్యిందంటూ పరంధామయ్య అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులోనే జీవితకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ‘మాదేం తప్పు లేదు..’ అని ఇదివరకటి కేసులో వాదించిన జీవిత, పై కోర్టులో తేల్చుకుంటామంటూ మీడియా ముందు హడావిడి చేసిన విషయం విదితమే.
మరి, తాజాగా జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్‌పై జీవిత స్పందన ఎలా వుంటుందోగానీ, దర్శకురాలిగా ఆమెకు వరుస పరాజయాలు.. ఇంకోపక్క హీరోగా రాజశేఖర్ వరుస వైఫల్యాలు.. ఇవన్నీ కాక, నిర్మాణం పరంగానూ జీవిత రాజశేఖర్ దంపతులకు ఇబ్బందులు వెరసి వారి టైమ్ ఇప్పుడస్సలేమాత్రం బాగోలేదన్పిస్తోంది.