ముకుందా..మళ్లీ అదే స్ట్రాటజీనా?

ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టయిల్ వుంటుంది. స్ట్రాటజీ వుంటుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమానే తీసుకోండి. ఇద్దరు పెద్ద హీరోలు కానీ గోపీ అనో, విజయ్ అనో, ఏ పేరు వినిపించదు..పెద్దోడా..చిన్నోడా అని తప్ప.…

ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టయిల్ వుంటుంది. స్ట్రాటజీ వుంటుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమానే తీసుకోండి. ఇద్దరు పెద్ద హీరోలు కానీ గోపీ అనో, విజయ్ అనో, ఏ పేరు వినిపించదు..పెద్దోడా..చిన్నోడా అని తప్ప. ఇప్పుడు అదే స్టయిల్ ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మళ్లీ మరోసారి రిపీట్ చేస్తున్నాడట. 

ముకుంద సినిమాలో హీరో హీరోయిన్లకు పేర్లు అనేవి లేకుండా. సినిమాకు కథ చెబుతున్నపుడే ఈ వైనం చెప్పేసాడట దర్శకుడు. ఈ వ్వవహారం సినిమా విడుదలయ్యేవరకు చాటున వుండేదే. కానీ హీరొయిన్ పూజా హెగ్డే ఈ రోజు మీడియాతో మాట్లాడడంతో బయటకు వచ్చేసింది.