బాలకృష్ణతో గత పదేళ్లలో హిట్ ఇవ్వగలిగిన ఏకైక దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రమే. మిగిలిన ఎవరూ కూడా బాలకృష్ణ ఇమేజ్‌కి తగ్గ పవర్‌ఫుల్ సినిమా తీసి మాస్‌ని మెప్పించలేకపోయారు. సింహా, లెజెండ్ చిత్రాలతో బోయపాటి శ్రీను తనకి మాత్రమే ఆ కిటుకు తెలుసునని చాటుకున్నాడు. దీంతో మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడా అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.
బాలకృష్ణతో ఈసారి తాను చేసే సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయని తనకి తెలుసునని, అందుకే అందుకు తగ్గ కథనే సిద్ధం చేసుకుని బాలకృష్ణతో మళ్లీ చేస్తానని బోయపాటి శ్రీను చెప్పాడు. బాలకృష్ణకి హ్యాట్రిక్ ఇవ్వాలని బోయపాటి గట్టిగా ఫిక్స్ అయ్యాడు. బాలయ్య వందవ సినిమా ఇతని దర్శకత్వంలోనే ఉంటుందని ఊహాగానాలు సాగుతున్నాయి.
బాలకృష్ణ కెరీర్‌లో ల్యాండ్ మార్క్ ఫిలిం కనుక దాని విషయంలో ఎలాంటి రాజీలు పడకూడదని అనుకుంటున్నారు. బాలకృష్ణని ఎలా చూపిస్తే జనం చూస్తారనేది తెలిసిన బోయపాటి శ్రీనుతో కాకుండా వేరొకరితో వందవ సినిమా చేసే అవకాశాలు లేవు.
మొదటిసారి అంచనాలు లేకుండా వచ్చి విజయాన్ని అందించిన బోయపాటి రెండోసారి తనపై అంచనాల ఒత్తిడి ఉన్నా కానీ హిట్ మూవీ ఇచ్చాడు. మరి మూడోసారి వందో సినిమా అనే ఎక్స్‌ట్రా బర్డెన్ కూడా ఉంటుంది కనుక దీనిని ఎలా జయించి బాలయ్యకి విజయాన్ని అందిస్తాడనేది చూడాల్సిందే.