అల్లరి నరేష్ తమ స్వంత బ్యానర్ ను బయటకు తీసాడు. ఈవివి సినిమా పతాకాన్ని మరోసారి రెపరెపలాడించాలన్నది నరేష్, ఆర్యన్ రాజేష్ ల ప్రయత్నం. అంతవరకు బాగానే వుంది. ఇందుకోసం ఇంద్రగంటి మోహన కృష్ణను దర్శకుడిగా ఎంచుకుని బందిపోటు సినిమాను రెడీ చేస్తున్నారు. అయితే ఇక్కడో సెంటిమెంట్ పాయింట్ వుంది.
అల్లరి నరేష్ తో అల్లరి చిల్లరగా సినిమాల తీస్తే హిట్ అయ్యాయి కానీ, పద్దతిగా తీస్తే కాదు. నరేష్ మాంచి ఊపు మీద వున్నపుడే దర్శకుడు బాపు ఓ ప్రయత్నం చేసాడు, చార్మితో కలిపి. ఫట్ మంది. ఆ తరువాత వంశీ ప్రయత్నించాడు. అదీ ఫటేల్ మంది. సరదాగా కాసేపు అంటే కాస్తేపు కూడా ఆడలేదు. ఆ తరువాత పద్దతిగా విశ్వనాధ్ ప్రయత్నించారు. కనీ వినీ ఎరుగని ఫ్లాప్ అయింది.
పెద్ద దర్శకులు, ముఖ్యంగా మేథావులు అల్లరి నరేష్ తో హిట్ ఇవ్వలేకపోయారు. మరి క్లాస్ సినిమాలు దర్శకుడి గా పేరొందిన ఇంద్రగంటి ఇప్పుడు బందిపోటు అనే మాంచి ఓల్డ్ హిట్ టైటిల్ తో చేస్తున్న ఫ్రయత్నం ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.