చిరు కెలుకుడు భారీనే

మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇలాంటిదే. అసలే బాద్ షా దెబ్బకు కిందామీదా అయి, ఆఖరికి గోవిందుడు…సినిమా ప్రారంభించాడు బండ్ల గణేష్. ఇప్పుడు ఆ సినిమా ఎక్కడి గొంగళి అక్కడే అన్న…

మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇలాంటిదే. అసలే బాద్ షా దెబ్బకు కిందామీదా అయి, ఆఖరికి గోవిందుడు…సినిమా ప్రారంభించాడు బండ్ల గణేష్. ఇప్పుడు ఆ సినిమా ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా తిరుగుతోంది. కీలకపాత్ర కు తీసుకుని పక్కభాష నటుడు రాజ్ కిరణ్ ను అక్కర్లేదని సాగనంపారు. కానీ నిర్మాత మాత్రం ఫుల్ పేమెంట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది.  

అక్కడితో పోలేదు..ప్రకాష్ రాజ్ కు ప్రీమియమ్ పేమెంట్ ఇచ్చి కాల్షీట్లు తీసుకున్నారు. పోనీ దాంతో పోయిందా అంటే అదీ లేదు. తీసిన దంతా డంప్ లో పడేసి మళ్లీ తీయాల్సి వస్తోంది. దీంతో బండ్లకు ఖర్చు బండ్లకొద్దీ అవుతొంది. ఏం చేస్తాడు ఒప్పుకున్నాక తప్పుతుందా..మెగావారికి కొడుకు సినిమా అంటే కాస్త అతి జాగ్రత్త ఎక్కువ. దాని ఫలితం ఇలాగే వుంటుంది.