రెండుమూడేళ్ల నుంచి పెద్ద సినిమా అంటే దేవీ లేకుంటే థమన్. జనం విసిగిపోతున్నారు. ఎవరన్నా వస్తారా..ఈ బోర్ వదిలిస్తారా అని సినిమా పాటల శ్రోతలు చూస్తున్నారు. నితిన్ సినిమాలతో ప్రారంభించి మనం వరకు వచ్చాడు అనూప్ రూబెన్స్. పెద్ద సినిమా ఇస్తే ఎలా చేస్తాడా అనుకున్నవారికి మనం సినిమాతో మాంచి సమాధానం ఇచ్చాడు.
దీంతో ఇప్పుడు మరో పెద్ద సినిమా అతగాడిని వెదుక్కుంటూ వచ్చింది. అది కూడా ఓ టాప్ హీరో సిఫార్సు చేసాడని వినికిడి. సస్పెన్స్ ఎందుకు కానీ, పవర్ స్టార్ మనం పాటలు విని సూపరెహె..అనుకుని, అనూప్ ను పిలిచి స్వయంగా అభినందించడమే కాకుండా ఓఎమ్ జి సినిమాకు అనూప్ ను పెట్టుకోమని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చాడట. దాంతో అప్పటివరకు వేరే సంగీత దర్శకుడిని అనుకున్న యూనిట్, అనూప్ ను ఫిక్సయిపోయిందట.