బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌కపూర్, హీరోయిన్ కత్రినాకైఫ్ వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్నారట. ఈ ఏడాది చివర్లోగా పెళ్ళి చేసుకోవాలని ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారట. ఈ విషయమై బాలీవుడ్లో గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఇరువురి సన్నిహితులకూ ఈ విషయం ముందే తెలియడం, వారే విషయాన్ని లీక్ చేయడంతో.. కత్రినా – రణ్‌బీర్‌ల పెళ్ళి వార్తలు బయటకొచ్చాయి.
‘వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవడం నిజమైతే.. ఆ వేడుకలో నేను డాన్స్ చేస్తా..’ అంటూ బాలీవుడ్ భామ కరీనాకపూర్ వ్యాఖ్యానించడం గమనార్హమిక్కడ. అంటే పెళ్ళి బాజాలకు కత్రినా – రణ్‌బీర్ రంగం సిద్ధం చేసుకున్నారనే అనుకోవాలి. రణ్‌బీర్ కపూర్ ఒకప్పుడు దీపికా పడుకొనేతో పీకల్లోతు ఎఫైర్ నడిపాడు. కానీ ఆ వ్యవహారం అప్పట్లో చెడిరది.
కత్రినా విషయానికొస్తే, సల్మాన్‌ఖాన్‌తో ఈమె కూడా పీకల్లోతు ప్రేమ వ్యవహారం నడిపింది. ఓ దశలో ఇద్దరూ ఒక్కటవుతారనే ప్రచారమూ జరిగింది. కానీ కత్రినా ఆ తర్వాత సల్మాన్‌ఖాన్‌కి దూరమైపోయింది. మొత్తమ్మీద, కత్రినా – రణ్బీర్కపూర్ల పెళ్ళి వార్తల్లో నిజమెంతో ఇంకా స్పష్టత రాకపోయినా, బాలీవుడ్లో చాలామంది వీరిద్దరికీ పెళ్ళి ఖాయమైపోయిందనే అనుకుంటున్నారు.