కన్‌ఫ్యూజన్‌లో నాగార్జున

మనం సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న నాగార్జున ఈ సినిమా తర్వాత ఒక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయాడు. ఇందులో ఒకే సీన్‌లో అలా మెరిసిన తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫ్యూచర్‌…

మనం సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న నాగార్జున ఈ సినిమా తర్వాత ఒక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయాడు. ఇందులో ఒకే సీన్‌లో అలా మెరిసిన తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫ్యూచర్‌ స్టార్‌ అవుతాడని అందరితో కితాబులు అందుకుంటున్నాడు. మహేష్‌బాబు కూడా అఖిల్‌ సూపర్‌గా ఉన్నాడని, భవిష్యత్తు అతడిదే అని అనేసాడు.     

ఇంతకుముందు అఖిల్‌ ఎంట్రీ గురించి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అతని తొలి సినిమాపై ఫోకస్‌ పెరిగింది. అతనితో మాస్‌ యాక్షన్‌ సినిమా తీస్తే బాగుంటుందని ఫాన్స్‌, క్యూట్‌ లవ్‌స్టోరీ తీస్తే బాగుంటుందని ఇంకొందరు.. ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అఖిల్‌ పరిచయం విషయంలో నాగ్‌ సందేహంలో పడ్డాడు.    

ఇంతవరకు దర్శకుడు ఖరారు కాని ఈ చిత్రానికి.. మరోసారి డైరెక్టర్స్‌ అన్వేషణలో పడ్డాడు. ఆమధ్య కొందరు దర్శకులతో చేద్దామని ఫిక్స్‌ అయినా కానీ మనం తర్వాత నాగ్‌ ఆలోచన మారిందట. దీంతో అఖిల్‌ ఇంట్రడక్షన్‌ ఇంకాస్త లేట్‌ అవుతుందని అంటున్నారు. వచ్చే ఏడాదిలో కానీ తన తొలి సినిమా సెట్స్‌ మీదకి వెళ్లదని అనిపిస్తోంది.