టాప్‌ 4లో మహేష్‌ లేడు

ఆల్‌టైమ్‌ బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్స్‌ లిస్ట్‌లో ‘రేసుగుర్రం’ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. యాభై ఆరు కోట్ల పైచిలుకు షేర్‌తో ఇంతవరకు నాలుగో స్థానంలో ఉన్న ‘దూకుడు’ని అయిదవ స్థానానికి రేసుగుర్రం నెట్టింది. దీంతో ఇప్పుడున్న…

ఆల్‌టైమ్‌ బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్స్‌ లిస్ట్‌లో ‘రేసుగుర్రం’ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. యాభై ఆరు కోట్ల పైచిలుకు షేర్‌తో ఇంతవరకు నాలుగో స్థానంలో ఉన్న ‘దూకుడు’ని అయిదవ స్థానానికి రేసుగుర్రం నెట్టింది. దీంతో ఇప్పుడున్న టాప్‌ 5 సినిమాల్లో మొదటి నాలుగూ మెగా హీరోలవే కావడం విశేషం. 

మొదటి స్థానంలో అత్తారింటికి దారేది, రెండవ స్థానంలో మగధీర, మూడవ ప్లేస్‌లో గబ్బర్‌సింగ్‌ ఉన్నాయి. ఇంతకాలం టాప్‌ బ్లాక్‌బస్టర్స్‌ సాధించలేకపోయిన అల్లు అర్జున్‌ రేంజ్‌ ఈ చిత్రంతో అమాంతం పెరిగింది. ఇప్పుడు అతను కూడా పెద్ద స్టార్ల జాబితాలో చేరిపోయాడు. 

త్వరలో రాబోయే ఆగడుతో మహేష్‌ ఏ స్థానాన్ని ఆక్రమిస్తాడనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. మూడేళ్ల క్రితం వచ్చిన అతని బ్లాక్‌బస్టర్‌ దూకుడు తక్కువ టికెట్‌ రేట్లతోనే యాభై ఆరు కోట్ల షేర్‌ సాధించి అప్పటికి రెండవ స్థానంలో నిలిచింది. ఇప్పటి టికెట్‌ రేట్ల ప్రకారం దూకుడు రేంజ్‌ వచ్చినా కానీ ఆగడుకి టాప్‌ 3లో చోటు ఖాయం.