కష్టాల్లో శంకర్‌ సినిమా

డైరెక్టర్‌ శంకర్‌ సినిమాలు అంత తక్కువ బడ్జెట్‌లో పూర్తి కావనే సంగతి తెలిసిందే. ప్రతి చిత్రాన్ని హై లెవల్లో తెరకెక్కించే శంకర్‌ ఇప్పుడు విక్రమ్‌తో తీస్తున్న మనోహరుడు (ఐ) కూడా తనదైన శైలిలో భారీగా…

డైరెక్టర్‌ శంకర్‌ సినిమాలు అంత తక్కువ బడ్జెట్‌లో పూర్తి కావనే సంగతి తెలిసిందే. ప్రతి చిత్రాన్ని హై లెవల్లో తెరకెక్కించే శంకర్‌ ఇప్పుడు విక్రమ్‌తో తీస్తున్న మనోహరుడు (ఐ) కూడా తనదైన శైలిలో భారీగా తీస్తున్నాడు. దీంతో ఈ చిత్రం బడ్జెట్‌ అంచనాలని మించిపోయిందని సమాచారం. భారీ చిత్రాల నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ కూడా ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ఇబ్బందులు పడుతున్నాడట. 

అయితే ఈ ప్రాజెక్ట్‌ని టేకోవర్‌ చేసుకోవడానికి రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిద్ధంగా ఉందని, డీల్‌ కుదిరితే త్వరలోనే ఈ సినిమా చేతులు మారుతుందని సమాచారం. ఇప్పటికే రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మనోహరుడు ఇంకా పూర్తి కాలేదు. అపరిచితుడు కంటే సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌తో, చాలా గ్రాండ్‌గా ఈ చిత్రం ఉంటుందట. 

అపరిచితుడు తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమా చేయలేకపోయిన విక్రమ్‌ దీంతో మరోసారి తనేంటో నిరూపించుకుంటాడని, శంకర్‌ పేరు ప్రఖ్యాతుల్ని ఈ చిత్రం ద్విగుణీకృతం చేస్తుందని కోలీవుడ్‌ సర్కిల్స్‌ అభిప్రాయ పడుతున్నాయి. అయితే ఆస్కార్‌ రవిచంద్రన్‌ స్థాయి నిర్మాతే దీనిని పూర్తి చేయలేక చేతులెత్తేసాడంటే… ఆ బడ్జెట్‌ రికవర్‌ కావాలంటే ఇదెంత పెద్ద హిట్‌ అవ్వాలో ఏమిటో?