పూరి-ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి, అన్ని వ్యవహారాలు పూరి కనుసన్నలలో నడుస్తున్నాయట. సినిమా విడుదల ఇక రెండు నెలల లోపే వుంది కాబట్టి, ఈలోగా కనీసం టీజర్, లేదా ఫస్ట్ లుక్ విడుదల చేయాలని బండ్ల అనుకుంటున్నాడట. కానీ దర్శకుడు పూరి ఆ దిశగా కనీసం ఆలోచించడం లేదట. ఎంత త్వరగా సినిమాను ఫినిష్ చేయాలా అన్నదే చూస్తున్నాడట.
నెల ముందు ఆడియో, అందుకు కాస్త ముందుగా ఫస్ట్ లుక్ ఇస్తే చాలని ఆయన అనుకుంటున్నాడేమో తెలియదు,కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ ఊసే లేదని తెలుస్తోంది. ఇంతకు ముందు బండ్ల ఒకటి రెండు సార్లు తన దగ్గర టీజర్ విషయం ప్రస్తావించిన వారికి ఒకటి రెండు రోజుల్లో వుంటుంది..వారంలో వుంటుంది అనే వారు. కానీ ఇప్పుడేమీ మాట్లాడడం లేదు. ఎప్పుడు పూరి-ఎన్టీఆర్ సై అంటారో అప్పుడే టీజర్..అంతవరకు అభిమానులు వెయిట్ చేయాల్సిందే.
ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటే విడుదలవుతుందనుకుంటున్న గోపాల గోపాల ఫస్ట్ లుక్ ఒకటి రెండు రోజల్లో వస్తుందని తెలుస్తోంది.