చాలాకాలం తరువాత మేకప్ వేసుకుని, మహేష్ బాబు సినిమాలో నటిస్తున్నాడు కమెడియన్ బండ్ల గణేష్. సరిలేరు నీకెవ్వరు సినిమాలో కీలకమైన ట్రయిన్ ఎపిసోడ్ లో హీరో, హీరోయన్లతో సహా బోలెడు మంది నటులు పాల్గొంటారు. వీళ్లలో బండ్ల గణేష్ కూడా ఒకడు. బండ్ల చేస్తున్నది దొంగ క్యారెక్టర్ అని తెలుస్తోంది.
ఓ దశలో రావురమేష్ జేబు కొట్టేస్తాడన్నమాట. ట్రయిన్ ఎపిసోడ్ తరువాత మళ్లీ క్లయిమాక్స్ లో జరిగే పెళ్లి ఎపిసోడ్ లో కూడా బండ్ల గణేష్ కనిపిస్తాడు. ఈ పెళ్లి ఎపిసోడ్ చిత్రీకరణ కేరళలో వుంటుంది. ఈ క్లయిమాక్స్ పెళ్లి ఎపిసోడ్ లో కూడా చాలామంది నటులు పాల్గొంటారు.
ఇదిలావుంటే అన్నపూర్ణ సెవెన్ యాకర్స్ లో వేసిన రైలు సెట్ లో షూటింగ్ జరుగుతుండడంతో, ఏం జరుగుతోందో అందరికీ తెలుస్తోంది. ట్రయిన్ ఎపిసోడ్ మొత్తం హిలేరియస్ గా వస్తోందని ఇండస్ట్రీలో బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎక్కువమంది నటులు నటించడం, వాళ్లంతా వేరే షూటింగ్ లకు వెళ్లినపుడు ఈ ముచ్చట్లు చెప్పడంతో సరిలేరు నీకెవ్వరు సినిమా ట్రయిన్ సీన్ మీద మాంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. మాంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిన రావు రమేష్ కు ఈ సినిమాతో పాటు, మన్మధుడు 2, ప్రతిరోజూ పండగే సినిమాలతో మాంచి టైమింగ్ వున్న కమెడియన్ అని కూడా పేరు వస్తుందని టాక్ వినిపిస్తోంది.