బావమరది ధాటికి హీరోకి ప్రశాంతత లేకుండా పోయిందా..!

సాధారణంగా సినిమా లాసైన నిర్మాతలకు ప్రశాంతత లేకుండా పోవడం సహజమే… అయితే తాజాగా నిర్మాతగా లాసైన ఒక హీరోకి మాత్రం ఈ తలనొప్పి మరింత తీవ్రంగా ఉంది. మరి ఆయనకు నష్టాలు ఏమీ కొత్త…

సాధారణంగా సినిమా లాసైన నిర్మాతలకు ప్రశాంతత లేకుండా పోవడం సహజమే… అయితే తాజాగా నిర్మాతగా లాసైన ఒక హీరోకి మాత్రం ఈ తలనొప్పి మరింత తీవ్రంగా ఉంది. మరి ఆయనకు నష్టాలు ఏమీ కొత్త కాదు.. అయితే ఎట్టొచ్చీ సొంత పెట్టుబడులు కాకపోవడమే ఆయనకు అస్సలు ప్రశాంత లేకుండా చేస్తోంది. విషయం ఏమిటంటే… నిర్మాతగా పేరు ఆయనదే అయినా… పెట్టుబడులు మాత్రం బామ్మర్దివి! ఆయన కూడా ఒకప్పుడు నిర్మాతే. అయితే ఈ మధ్య తాను స్ట్రైట్ గా రంగంలోకి దిగకుండా… తన బావ చేత పెట్టుబడులు పెట్టిస్తున్నాడు.  అది కూడా మొహమాటం కొద్దీనే అని తెలుస్తోంది.

మరి సినిమాలు అంతో ఇంతో హిట్స్ అయితే పర్వాలేదు. ఈ హీరోగారి బావమరిది కూడా కూల్ గా ఉండేవాడు. అయితే ఈ మధ్యవరస డిజాస్టర్లు పడ్డాయి. ఈ హీరో సొంతంగా నటించిన సినిమా ఒక టి బీభత్సమైన ప్లాఫ్ గా నిలిచింది. అర్థంలేకుండా ఆ సినిమాకు భారీ పెట్టుబడులు పెట్టారనే టాక్ కూడా వచ్చింది. మరి ఈ హీరోగారికి అప్పటికీ జ్ఞానోదయం కాలేదు. మరో హీరోని పెట్టి భారీ పెట్టుబడి పెట్టి మరో సినిమాను తీశాడు. అయితే ఇది మరో డిజాస్టర్. ఇక్కడ కూడా సినిమాలో స్టఫ్ లేక కాదు కానీ.. నిర్మాత మిస్ మ్యానేజ్ మెంట్ వల్లనే ఎక్కువ నష్టం జరిగిందని స్పష్టంగా అర్థం అవుతోంది.

ఇంకేముంది… రచ్చ రేగింది. ఈ విధమైన మిస్ మేనేజ్ మెంట్ చేయడంపై హీరోపై బావమరిది గరం అవుతున్నాడు. మామూలుగా కాదు.. ఈ హీరోగారి ఆఫీసులో చాలా రోజుల పాటు వీళ్ల గొడవ నడిచింది. ఒకరిపై మరొకరు అరుచుకోవడంతో.. వీళ్ల ఆఫీసున్న వీధి మొత్తం వీళ్ల గొడవ పాపులర్ అయ్యింది. ఈ తలనొప్పిని తట్టుకోలేక సదరు హీరో లండన్ వెళ్లిపోయాడు. డబ్బు పోవడం కన్నా.. బామ్మర్ధి గొడవే ఆ హీరోకి ప్రశాంతత లేకుండా చేస్తోందని తెలుస్తోంది. మరి ఏ బంధానికైనా డబ్బే కదా బేస్ మెంట్. అలాంటి డబ్బు పోయినప్పుడు గొడవలు తప్పవు మరి!