ప్రయోగాల సినిమాలొస్తున్నాయ్

తెలుగునాట హీరో, హీరోయిన్లపై ప్రయోగాలు చేస్తే, ప్రేక్షకులకు అంతగా నచ్చదు. ప్రయోగాలు చేయకపోతే, ఎప్పుడూ రొటీన్ సినిమాలేనా, రొటీన్ పాత్రలేనా అంటారు. సరే, ఆ మాట మనకెందుకు అని డైరక్టర్లు, హీరోలు,హీరోయిన్లు అప్పుడప్పుడు వైవిధ్యమైన…

తెలుగునాట హీరో, హీరోయిన్లపై ప్రయోగాలు చేస్తే, ప్రేక్షకులకు అంతగా నచ్చదు. ప్రయోగాలు చేయకపోతే, ఎప్పుడూ రొటీన్ సినిమాలేనా, రొటీన్ పాత్రలేనా అంటారు. సరే, ఆ మాట మనకెందుకు అని డైరక్టర్లు, హీరోలు,హీరోయిన్లు అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేస్తుంటారు. అలాంటి సినిమాలు కొన్ని రెడీ అవుతున్నాయి. వీటిలో ముందుంటుంది ‘సైజ్ జీరో’. అనుష్కను  లడ్డూబేబీ లా చూపించే సినిమా. 

తీయడం తీసేసారు, కానీ ఇప్పుడు భయం మొదలయింది, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని? రెండు మూడు ఫొటోలు వదిలిన తరువాత మరి ఏం ఫీడ్ బ్యాక్ వచ్చిందో ఏమో, మరి ఆ టైపు ఫొటోలు విడుదల చేస్తే ఒట్టు. నాజూకైన, అందమైన అనుష్కనే చూపిస్తున్నారు. నరేష్ చేసిన లడ్డూబాబును జనం చూడలేదు.మరి ఈ లడ్డూబేబీని చూస్తారా? ఏమో? ఇదెలా వుంటుందో?

ఇక నాగ్-కార్తీ కాంబినేషన్ లో ఊపిరి సినిమా వస్తోంది. ఈ సినిమాలో చాలా సేపు నాగ్ వీల్ చైర్ లో వుంటాడని సినిమా ప్రొడక్షన్ కు ముందే బయటకు వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ అదే వచ్చింది. గతంల్ రమ్యకృష్ణను మంచం మీద, వీల్ చైర్ లో వుంచి కృష్ణవంశీ చంధ్రలేఖ సినిమా చేసాడు. జనం వెనక్కు పంపారు. మరి ఇప్పుడు నాగ్ ధైర్యం చేస్తున్నాడు. డైరక్టర్ వంశీ పైడిపల్లి స్టామినా తెలిసిన వారు ఏ మాత్రం అనుమానం పడడం లేదు. ఏదో విషయం వుండే వుంటుంది అంటున్నారు. చూడాలి ఆ విషయం ఏమిటో?

హీరోను టైటిల్స్ నుంచి శుభం వరకు గడ్డం తో చూడ్డం అంటే మనవాళ్లకు కొంచెం కష్టం. మరి ఎన్టీఆర్…నాన్నకు ప్రేమతో అంటూ, గడ్డం గెటప్ తో కనిపిస్తున్నాడు. సినిమా లో మరో క్యారెక్టర్ వుంటుందని, అది గెడ్డం లేకుండా వుంటుందని టాక్. అలా అయితే ఓకె అనుకోవాలి.

1945 నాటి కథ పట్టుకుని, ఆనాటి స్టయిల్ హీరోగా వస్తున్నాడు వరుణ్ తేజ. మనకు ఆనాటి కథలు తీసుకున్నా, సగం అది సగం ఇది అన్నట్లు రెండూ మిక్స్ చేయడమే తెలుసు. కానీ అలా కాకుండా ప్యూర్ టైం బ్యాక్ సినిమా అంటే ఎలా వుంటుందో? ఆ మధ్య వచ్చిన మదరాసు పట్టణం గుర్తుకువస్తోంది ట్రయిలర్ చూస్తుంటే. చూడాలి ఇదెలా వుంటుందో?

ఇలా ప్రయోగాల సినిమాలు వరుసగా జనం ముందుకు వస్తున్నాయి. ఏలాంటి రిసెప్షన్ కు నోచుకుంటాయో చూడాలి.