2 దశాబ్దాల తర్వాత రీఎంట్రీ

23 ఏళ్ల తర్వాత అన్షు, టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘మజాకా’ సినిమాలో ఆమె నటిస్తోంది.

మన్మధుడు సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన అన్షు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలకే ఆమె ఫేడవుట్ అయింది.

అన్షు చాలా తొందరగానే పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి లండన్ లో స్థిరపడింది. రీసెంట్ గా ఆమె హైదరాబాద్ వచ్చింది. రీఎంట్రీ ఇచ్చే ఆలోచనతోనే ఆమె హైదరాబాద్ వచ్చింది. అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నించింది.

ఇందులో భాగంగా తన ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి పెద్ద పార్టీ కూడా ఇచ్చింది. అన్షు ఏర్పాటుచేసిన పార్టీకి నాగార్జున సతీసమేతంగా వచ్చారు. అలా అన్షు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

23 ఏళ్ల తర్వాత అన్షు, టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘మజాకా’ సినిమాలో ఆమె నటిస్తోంది. ఈరోజు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అందులో పెళ్లి కూతురు గెటప్ లో యశోద పాత్రలో కనిపిస్తోంది.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ నిర్మాతగా తెరకెక్కుతోంది మజాకా సినిమా. త్రినాధరావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

2 Replies to “2 దశాబ్దాల తర్వాత రీఎంట్రీ”

Comments are closed.