దర్శకుడు బాబీకి ప్రేమతో.. ఊర్వశి

నిజానికి ఈ రెండు సినిమాల మధ్యలో మరో 3 సినిమాలు చేసింది ఊర్వశి. కానీ అప్పుడు ‘బాస్ పార్టీ’.. ఇప్పుడీ ‘దబిడి దిబిడి’ మాత్రమే ఆమెకు క్రేజ్ తెచ్చాయి.

అందానికేం తక్కువ లేదు, అందాల ఆరబోతకు మొహమాటం లేదు. ఎటొచ్చి హిట్టిచ్చే దర్శకుడే ఇన్నాళ్లూ దొరకలేదు. ఎట్టకేలకు బాబి కొల్లి రూపంలో ఊర్వశి రౌతేలాకు ఆ లోటు తీరింది.

వాల్తేరు వీరయ్యలో ఐటెంసాంగ్ కోసం ఊర్వశిని తీసుకున్నాడు దర్శకుడు బాబి. ‘బాస్ పార్టీ’ అంటూ తెరపైకొచ్చిన ఊర్వశి, హిట్ కొట్టేసింది. సినిమా గురించి జనం ఎంత మాట్లాడుకున్నారో, ఆ ఒక్క సాంగ్ గురించి కూడా అంతే మాట్లాడుకున్నారు.

కట్ చేస్తే, ఇప్పుడు మళ్లీ అదే రెస్పాన్స్. ఈసారి కూడా దర్శకుడు బాబీనే. డాకు మహారాజ్ సినిమా కోసం మరోసారి ఊర్వశి రౌతేలాను తీసుకున్నాడు. ఈసారి ‘దబిడి దిబిడి’ సాంగ్ పెట్టాడు. సూటిగా చెప్పాలంటే సినిమాలో సూపర్ హిట్టయిన సాంగ్ ఇదొక్కటే.

ప్రత్యేకంగా ఈ సాంగ్, అందులో ఊర్వశి అందాలు, ఆమె స్టెప్పుల గురించి జనం మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఈ రెండు సినిమాల మధ్యలో మరో 3 సినిమాలు చేసింది ఊర్వశి. కానీ అప్పుడు ‘బాస్ పార్టీ’.. ఇప్పుడీ ‘దబిడి దిబిడి’ మాత్రమే ఆమెకు క్రేజ్ తెచ్చాయి.

దీంతో తన ఆనందాన్ని, కృతజ్ఞతను లేఖ రూపంలో విడుదల చేసింది ఊర్వశి. తనను నమ్మినందుకు బాబీకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది. ఈ సినిమాలో కేవలం సాంగ్ కు మాత్రమే పరిమితం అవ్వలేదు ఊర్వశి. ఆమెకు దర్శకుడు ఓ చిన్న రోల్ ఇచ్చాడు. ఫస్టాఫ్ లో ఆమెతో ఫైట్ కూడా చేయించాడు. అలా ఊర్వశికి ప్రమోషన్ ఇచ్చాడు. అందుకే ఇంత కృతజ్ఞత, అంత ప్రేమ.

9 Replies to “దర్శకుడు బాబీకి ప్రేమతో.. ఊర్వశి”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. Balayya baadina baadudiki papam madam ki noppulu taggadaniki enni rojulu pattintaado. veepu vimanam motha moginchadu musaladu. adaithe maatram highlight comedy.

Comments are closed.