ఏడు నెల‌ల పాల‌న‌… స‌న్న‌గిల్లుతున్న ఆశ‌లు!

కాలం అత్యంత శ‌క్తిమంత‌మైంది. ఓడ‌లు బండ్లు… బండ్లు ఓడ‌ల‌వుతుంటాయి. కాల ప‌రీక్ష‌ను దీటుగా ఎదుర్కొన్న వాళ్లే బ‌రిలో నిల‌బ‌డ‌గ‌లుగుతారు.

కాలం అత్యంత శ‌క్తిమంత‌మైంది. ఓడ‌లు బండ్లు… బండ్లు ఓడ‌ల‌వుతుంటాయి. కాల ప‌రీక్ష‌ను దీటుగా ఎదుర్కొన్న వాళ్లే బ‌రిలో నిల‌బ‌డ‌గ‌లుగుతారు. మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయాల్లో ప్ర‌తి క్ష‌ణం విలువైంది. అధికారంలో ఉన్న‌వాళ్ల‌కు కాల ప‌రుగు క‌నిపించ‌దు. కూట‌మి స‌ర్కార్ ఇవాళ్టితో ఏడునెల‌లు పూర్తి చేసుకుంది. జూన్ 12న చంద్ర‌బాబు స‌ర్కార్ కొలువుదీరింది. కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమిత‌మై, క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాను ద‌క్కించుకోని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇక కోలుకోలేర‌ని కూట‌మి నేత‌లు అనుకున్నారు.

ముఖ్యంగా టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు త‌మ‌కు ఎదురే లేద‌ని సంతోషించారు. వైసీపీ కోలుకోవ‌డం సంగ‌తి ప‌క్క‌న పెడితే, ఆ పార్టీ ఉండ‌ద‌ని, అందులోని నాయ‌కులంతా వ‌ల‌స‌బాట ప‌డ‌తార‌ని ఎన్నెన్నో ఊహించుకున్నారు. నిజ‌మే, కొంత మంది నాయ‌కులు పార్టీ మారారు. భ‌విష్య‌త్‌లో కూడా మ‌రికొంద‌రు మారొచ్చు. కానీ ఒక కీల‌క విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్దు. రోజుల గ‌డిచేకొద్ది కూట‌మి స‌ర్కార్‌పై ప్ర‌జానీకంలో అసంతృప్తి పెరుగుతోంది.

మ‌రీ ముఖ్యంగా కూట‌మి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి పెర‌గ‌డం ప్ర‌మాద హెచ్చ‌రిక‌గా భావించాల్సి వుంటుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏవేవో ప‌నులు చేసుకోవ‌చ్చ‌ని, త‌మ బ‌తుకులు మారుతాయ‌ని కార్య‌క‌ర్త‌లు మొద‌లుకుని నాయ‌కుల దాకా క‌ల‌లు క‌న్నారు. కానీ ఆ క‌ల‌లు క‌ల్ల‌ల‌వుతున్నాయి. కూట‌మిపై ఒక వైపు అసంతృప్తి పెరుగుతుంటే, మ‌రోవైపు మ‌ళ్లీ వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి రార‌ని పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ‌ను ప‌దేప‌దే అడుగుతున్నార‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్ చెబుతుండ‌డం టీడీపీ శ్రేణుల్లో భ‌యం క‌లిగిస్తోంది.

ఏడు నెల‌ల‌కే కూట‌మి స‌ర్కార్‌పై అసంతృప్తి రావ‌డానికి ఎన్నో కార‌ణాలున్నాయి. హామీల అమ‌ల్లో నాన్చివేత ధోర‌ణి, మ‌రికొన్నింటిలో చిత్త‌శుద్ధి లేక‌పోవ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు ఉచిత ఇసుక‌. వైసీపీ పాల‌న‌లో కంటే, ఇప్పుడే ఎక్కువ రేటు ప‌లుకుతోంద‌ని పార్టీల‌కు అతీతంగా ప్ర‌జానీకంగా చెబుతున్న మాట‌.

అప్పుడ‌ప్పుడు డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై వెలువ‌రించే ఆణిముత్యాల్లాంటి విమ‌ర్శ‌లు.. చంద్ర‌బాబు స‌ర్కార్‌కు తీవ్ర న‌ష్టాన్ని తీసుకొస్తున్నాయి. ప్ర‌జ‌లు తిడుతున్నార‌ని బ‌హిరంగంగా ఇప్ప‌టికి రెండుసార్లు ప‌వ‌న్ అన్నారు. ఈ మాట వైఎస్ జ‌గ‌న్ అంటే సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు.

ప్ర‌భుత్వంలో కీల‌క హోదాలో ఉన్న ప‌వ‌నే విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం కూట‌మిపై వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు. దీంతో కూట‌మి ప్ర‌భుత్వంపై సొంత శ్రేణుల్లోనే ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్నాయి. నాలుగేళ్ల త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంపై అప్పుడే అనుమానాలు త‌లెత్త‌డం విచిత్ర ప‌రిణామం.

33 Replies to “ఏడు నెల‌ల పాల‌న‌… స‌న్న‌గిల్లుతున్న ఆశ‌లు!”

  1. పవన్ కల్యాణ్ లాంటి ప్రశ్నించే పొలిటికల్ లీడర్ ఆంధ్ర ప్రదేశ్ కి అవసరం…పవన్ కి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ లేక పొవొచ్చు…జరిగే తప్పులు ఎత్తి చూపించే ధైర్యం ఉంది…

  2. Jagan లఫుట్ గాడికి నోరు లేగాకుండా చేయాలి అంటే కూటమి వెంటనే ఇవి చేయాలి

    1. లబ్ధిదారుల చిట్టాను సరిచేసి నిజంగా అవసరం అనుకున్న వాళ్ళని మాత్రమే లిస్ట్ లో ఉంచాలి

    2. ఆ తగ్గించిన లబ్దిదారులకు వెంటనే రైతులకి 20 వేలు, ఆడోళ్లకి 18 వేలు, పిల్లలకి 15 వేలు అన్న ప్రోగ్రామ్స్ అమలు చేయాలి

    3. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసేసి తెలుగు మీడియం తిరిగి తేవాలి

    4. కొత్త టూల్స్ వెంటనే తెచ్చి ఆ వచ్చిన డబ్బులతో రోడ్స్ వెంటనే వేయాలి

    వచ్చే 6 నెలల్లో ఇవి గనక చేస్తే ఇక వైఛీపీ అన్న పార్టీ కనపడమన్న కనపడదు

  3. “ఏడు నెల‌ల పాల‌న‌… స‌న్న‌గిల్లుతున్న ఆశ‌లు!”…good, Jagan should loose hope and leave andhra politics…useless fellow

  4. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  5. Jagan palana entha ghoranga undi ante asalu roads ku patching veste chalau tdp malli2029 lo gesutundi. Antha chandalanga palana chesi 11 ku paddam.

  6. ఫీజ్ రేయింబర్సుమెంట్ — జగన్ రెడ్డి దిగేనాటికి బకాయిలు 3000 కోట్లు — ఇప్పుడు 788 కోట్లు రిలీజ్ చేశారు

    ఉద్యోగులకు పీఎఫ్ బకాయిలు — జగన్ రెడ్డి వాడేసుకొన్నాడు — ఇప్పుడు 519 కోట్లు రిలీజ్ చేశారు

    ఉద్యోగుల సీపీఎస్ కి రాష్ట్ర ప్రభుత్వ వాటా – 300 కోట్లు రిలీజ్ చేశారు

    టీడీఎస్ బకాయిలు – 260 కోట్లు

    చిన్న కాంట్రాక్టర్స్ కి బిల్లులు బకాయిలు — గత ఐదేళ్లు పైసా కూడా ఇవ్వలేదు — ఇప్పుడు 586 కోట్లు రిలీజ్ చేశారు

    అమరావతి కౌలు రైతులకు కౌలు బకాయిలు — జగన్ రెడ్డి .. వద్దులే.. దరిద్రుడు — ఇప్పుడు 244 కోట్లు రిలీజ్ చేశారు

    చిన్న వ్యాపారులకు – 100 కోట్లు

    ఆరోగ్యశ్రీ బకాయిలు — జగన్ రెడ్డి దిగేనాటికి బకాయిలు 1700 కోట్లు — ఇప్పుడు 600 కోట్లు రిలీజ్ చేశారు

    పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిలు — గత ఐదేళ్లు పైసా కూడా ఇవ్వలేదు — ఇప్పుడు 214 కోట్లు ఒక విడత రిలీజ్ చేశారు..

    విద్యుత్ సబ్సిడీలకు – 500 కోట్లు

    కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా – 627 కోట్లు

    MSME లకు 120 కోట్లు..

    ..

    ఇది కాకుండా పోలవరం ముంపు ప్రాంత వాసులకు 60% నిధులు డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లో జమ చేసేసారు..

    పోలవరం మొదలైన తర్వాత మొదటిసారిగా ఆ ముంపు ప్రాంత ప్రజలకు పునరావాస నిధి అందింది..

    ..

    ఇలా అన్ని వర్గాలకు అసలు సిసలైన .. సంతోషకరమైన సంక్రాంతి..

    సుమారు 6 ఏళ్ళ తర్వాత అమరావతి, పోలవరం రైతులు ఆనందం గా గడుపుకునే సంక్రాంతి ఇదే..

    ఈ జగన్ రెడ్డి మీడియా , జగన్ రెడ్డి జనాలు ఏడుస్తూనే ఉంటారు..

    7 నెలల్లోనే చాలా వర్గాల కష్టానికి వాళ్ళ డబ్బు చేతికి అందటం.. కొన్ని లక్షల మంది ఇండ్లలో ఆనందపడుతుంటారు..

    మనం మంచి వైపు ఉందాం.. ఈ పండుగ అందరితో పాటు సంతోషం గా గడుపుకొందాం..

      1. నీకు తెలిసిన నీ తెలివి ఏంటో చెప్పు .. నాచెప్పు ..

        అప్పుడు చదివే జనాలు డిసైడ్ అవుతారు..

    1. Fees Reimbursement, 2019 Chandra Naidu degetappatiki 5500 cr, Jagan dege tappatiki 500cr

      Vidyut bakayilu, 3019 Chandra Naidu degetapaptiki 60000 cr, Jagan degetappatiki 10000 cr

      Arogyasri Bakayili, Chandra Naidu degetappatiki 6000 cr, Jagan degetappatiki 1500 cr

      Housing bakaayilu Chandra Naidu degateappatiki 5500 cr, Jagan degenatiki 2000 cr.

      Chandra Naidu degetappatiki AP appu 4.2 lakh cr, Jagan degetappatiki 6.5 lakh cr, ry 7 months lo 1.2 lakh cr Chandra Naidu appu

    2. meeru coin ki oka vaipu alochisthe ilage untadi…paina cheppinavanni govt change ayinappudu common ga jarigede…ado ekkava oohinchesukuni TV5, ABN, EEnadu TV lu chusi matlada vaddu …

      State ibbandullo undi…Ippatike Govt chala appulu chesindi.Raboye rojulu AP pajalu kashta padalsinde..

      1. మీ వాదన లో వింతేముందిలే మోహన్ రావు గారు..

        కియా ఇండస్ట్రీ నే జగన్ రెడ్డి తెచ్చేసాడు అని చెప్పుకున్న బతుకులు మీవి..

        రాష్ట్రం లో ఏ మంచి జరిగినా.. అది జగన్ రెడ్డి వల్లనే..

        ప్రపంచం లో ఏ చెడు జరిగినా.. అది చంద్రబాబు వల్లనే అని చెప్పుకొనే పార్టీ పరిస్థితి మీది..

        లేకపోతే.. నీచం గా.. జగన్ రెడ్డి ఇంట్లో మర్డర్ జరిగితే.. చంద్రబాబు మీద తోసేసిన మీరు.. ఈ కథలు కొత్తగా చెప్పేదేముంది..

  7. అన్ని సూపర్ సిక్సులు నీతిగా కరెక్ట్ టైం లోపల అమలు చేయకపోతే చంద్రిక , పావని పూలు బద్దలు అవుతాయి.

  8. అసలు జనాలు ఆలోచించింది జగన్ అనే ఒక సా..డిస్ట్,మూ….ర్కుడు, సై…..కో ని శాశ్వతంగా అధికారానికి దూరం చెయ్యాలని.అందుకే 11 తో పండబెట్టారు. కూటమి ఎం చేసినా చేయకున్నా జగన్ అనేవాడికి వోట్ ఏయ్యటం జరిగే పని కాదు.ఎం చేసాడు అని మళ్ళీ ఓట్లు అడుగుతాడు?రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి బట.ఎంన్ లు నొక్కతా అంటాడా?

    గను.. లు, ఇసుక,మద్యం..ఇలా అన్నీ దోచేసి జనాలకి ముష్టి ఎస్త అంటాడా?ఇంత బలమైన కూటమి వల్ల కాలేదు అంటే వాడొచ్చి పొడు…స్తాడాని నమ్ముతారా?

    మీరు ఇలానే ఆశల పల్లకి లో ఊరేగండి.. కనీసం 15 ఏళ్ళు అధికారంలో కూటమినే.

  9. Ponile langa 11 , nenu edi chesa ani vote adagaledu antavu. Kootami evi cheyaledu ani vote veyali antavu.

    Mari neeli lk lu cbn ni anevaru kada . 5 years Neeli lk lu emi chesaru

  10. “ఏడు నెల‌ల పాల‌న‌… స‌న్న‌గిల్లుతున్న ఆశ‌లు!” – sure, Jagan should loose all hopes and get out of andhra politics

  11. ప్రభుత్వం మారాల్సిన విపత్కర పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర ప్రదేశ్… ఖచ్చితంగా జగనన్న రావాల్సిందే

  12. రైతు భరోసా బదులు ఇది చేస్తే బాగుంటుంది నిజమైన రైతులకు కావలసింది ఇది కాదు దుక్కు దమ్ము కోత నూర్పిడి వంటివి తక్కువ రేట్లకు యంత్రపరికరాలు దొరికే విధం గ చేస్తే రైతుకు లాభదాయకం గ ఉంటుంది స్ప్రేయర్ లు weeder లు వంటివి తక్కువ రేట్లకు అద్దెకు దొరికే విధం గ చేయాలి

  13. మా అన్నయ్య నీ లేపడానికి జర్నలిస్టు సాయన్న, జర్నలిస్టు వైఎన్ఆర్, జర్నలిస్టు కొమ్మినేని, విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ ఉన్నారు లే..

Comments are closed.