Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బెంగాల్ టైగర్ గట్టెక్కేసినట్లేనా?

బెంగాల్ టైగర్ గట్టెక్కేసినట్లేనా?

బెంగాల్ టైగర్ ఫస్ట్ వీక్ వసూళ్లు పదహారు కోట్లకు కాస్త తక్కువగా వచ్చాయి. నిజానికి ఇరవై వరకు వస్తాయని అంచనా వేసుకున్నారు యూనిట్ జనాలు. అయితే మొత్తం మీద నాలుగు రోజులకు 16వచ్చింది. రవితేజకు సంబంధించినంత వరకు ఇవి గొప్ప కలెక్షన్లే. కానీ సోమవారం కాస్త డ్రాప్ అయినట్లు వినికిడి. 

అయితే ఇప్పటి వరకు ఓవర్ సీస్ లో బ్రేకీవన్ అయిపోయింది. నైజాంలో మరో కోటి రూపాయిలు రావాలి. ఇప్పటి వరకు ఆరు కోట్లు వచ్చాయి. ఇక ఆంధ్ర సీడెడ్ కలిపి 11.5 కోట్ల మేరకు బిజినెస్ చేసారు. తొమ్మిది నుంచి పది కోట్ల వరకు వచ్చాయని తెలుస్తోంది. అంటే అక్కడా ఇంకో కోటి నుంచి కోటిన్నర రావాల్సి వుంటుంది. 

సోమ, మంగళ, బుధ వారాల్లో ఈ మేరకు సాధించాలి. లేదూ అంటే లోఫర్ థియేటర్లలోకి వస్తుంది. అయితే ఎంత కాదన్నా సెకెండ్ వీకెండ్ కొంతయినా వుంటుంది. అక్కడ తెచ్చుకోవాల్సి వుంటుంది. లోఫర్ లో వుండే ఎంటర్ టైన్ మెంట్ కంటెంట్ ను బట్టి వుంటుంది బెంగాల్ టైగర్ ఓవర్ ఫ్లోస్ అన్నది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?