పూరి జగన్నాధ్..టాలీవుడ్ టాప్ డైరక్టర్లలో ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమా వస్తోంది అంటే బయ్యర్లు బాక్స్ లతో ముందే రెడీ అయిపోయేవారు. అలాంటిది ఇప్పుడు సినిమా విడుదల రోజుల్లోకి వచ్చినా, ఏరియాల సెటిల్ మెంట్ లు కావడం లేదు. ఇప్పుడు లోఫర్ సినిమా హిట్ అయితేనే మళ్లీ పూరి మార్కెట్ పుంజుకునేది. లోఫర్ హీరో వరుణ్ తేజ కు ఇంతవరకు కమర్షియల్ హిట్ లేదు. మరోపక్క పూరికి మార్కెట్ డౌన్ గా వుంది.
నిజానికి లోఫర్ సినిమా సబ్జెక్ట్ ప్రకారం మాస్ ఏరియాల్లో బాగానే వర్కవుట్ అయ్యేలాగే వుంది. పైగా సెన్సార్ రిపోర్టు, ల్యాబ్ రిపోర్టు బాగానే వుంది. కానీ బయ్యర్లు నిర్మాత చెప్పిన రేట్లకు ముందుకు రావడం లేదని వినికిడి. దీంతో ఓన్ రిస్క్ మీదే విడుదల చేసేయాలని నిర్మాత కళ్యాణ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఒక్క నైజాం ఏరియా మాత్రం అమ్మకం అయిపోయింది. మిగిలిన ఏరియాలు అంటే సుమారు దగ్గర దగ్గర పది నుంచి పదిహేను కోట్లు. సినిమా హిట్ అయితే సి కళ్యాణ్ కు పండగే. ఎందుకంటే రిస్క్..లాభం రెండూ ఆయనవే కనుక. కానీ సినిమా తేడావస్తే, కళ్యాణ్ కు కష్టమే.