బాహుబలి’ కి కొనసాగింపుగా వస్తున్న ‘బాహుబలి- ది కంక్లూజన్’ సీక్వెల్ వెర్షన్ ప్రీ రిలీజ్ మార్కెట్ విషయంలో అనితర సాధ్యమైన నంబర్లు వినిపిస్తున్నాయి! ఈ సినిమా ఐదు వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అసలు కథ ఏంటో కానీ.. హిందీ మీడియా ఈ ప్రచారం చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల థియేటరికల్ రైట్స్ ధర రూ.130 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ ప్రదర్శన హక్కుల విలువ రూ.100 కోట్టు. తమిళ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ.47 కోట్లు, కన్నడ నాట విడుదల హక్కుల విలువ 45 కోట్లు, మలయాళ వెర్షన్ ప్రదర్శన హక్కుల ధర రూ.10 కోట్లు, ఓవర్సీస్ విషయానికి వస్తే.. ఉత్తరమెరికా లో మాత్రమే ఈ సినిమా ప్రదర్శన హక్కులను రూ.45 కోట్లకు అమ్ముతున్నారట.
ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ హక్కులతోనే రూ.370 కోట్ల పై మొత్తం వస్తుందని అంటున్నారు. ఇక టీవీ ప్రసార హక్కులు మరో ముఖ్యమైన ఆదాయ వనరు. ఈ సినిమా తెలుగు టెలికాస్ట్ రైట్స్ 26 కోట్లకు అమ్ముతున్నారని, హిందీ వెర్షన్ ను అయితే ఏకంగా 50 కోట్ల మొత్తానికి అమ్ముతున్నారట! ఇక తమిళ, మలయాళీ వెర్షన్ల ప్రసార హక్కులు అదనం. ఏతావాతా ఈ సినిమా విడుదలకు ముందే ఐదు వందల కోట్ల రూపాయల మార్కును రీచ్ కాబోతోందని చెబుతున్నారు. మరి నంబర్ లు వినడానికి బాగున్నాయ్ కానీ అసలు కథ ఏంటో .. !