హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ గ్యాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు టైటిల్ గా భవదీయుడు-భగత్ సింగ్ అని ఫిక్స్ చేసారనే గ్యాసిప్ తెగ వినిపిస్తోంది.
గబ్బర్ సింగ్ తరువాత భగత్ సింగ్ అన్నది యాప్ట్ టైటిల్ అవుతుందని, అందుకే అది ఫిక్స్ చేసారని టాక్. అయితే ఇది నిజమా? ప్యూర్ గ్యాసిప్ నా అన్నది తెలియదు.
భవదీయుడు అన్నది ముందు పెట్టి వెనకాల భగత్ సింగ్ లేదా ఇంకేదైనా పెట్టాలని ఆలోచన చేస్తున్నారని కూడా గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. భగత్ సింగ్ అని పెడితే అభ్యంతరాలు ఏమైనా వస్తాయేమో అని భావిస్తున్నారని బోగట్టా. అలాంటపుడు ఆప్షనల్ గా మరో పేరు భవదీయుడు పక్కన చేర్చే అవకాశం వుందని తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఇవన్నీ గ్యాసిప్ లే. భవదీయుడు..భగత్ సింగ్ అని హరీష్ శంకర్ అనుకున్న మాట నిజమే. కానీ అది ఇప్పుడు కాదు, కొన్నాళ్ల క్రితం అని, ఇప్పుడు మారిందని కూడా కొందరు అంటున్నారు. మొత్తానికి భవదీయుడు భగత్ సింగ్ అన్న టైటిల్ కాస్త ఇంట్రస్ట్ గానే వుంది.