పక్కా గలీజు పోరడు-డిజె టుల్లు

ఇయ్యాల రేపు పోరడు అంటే ఎట్లుండాలె. అచ్చం అట్లనే వున్నాడు డిజె టుల్లు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార పతాకంపై తయారైన సినిమా డిజె టుల్లు. ఈ సినిమా టీజర్ బయటకు వచ్చింది.  Advertisement…

ఇయ్యాల రేపు పోరడు అంటే ఎట్లుండాలె. అచ్చం అట్లనే వున్నాడు డిజె టుల్లు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార పతాకంపై తయారైన సినిమా డిజె టుల్లు. ఈ సినిమా టీజర్ బయటకు వచ్చింది. 

ఇయ్యాల రేపు యూత్ ఫిల్మ్ అంటే ఇట్లుండాలే అన్నట్లుంది టీజర్. పక్కా అల్లరి చిల్లరి వ్యవహారం. టీజర్ చివర లాంగ్ ఐరన్ రాంగ్ 'అక్కడ' దింపేయ్ అన్న రేంజ్ లో.

పేరుకు డిజె కానీ పక్కా మహంకాళి జాతర, బోనాలు, శారీ ఫంక్షన్ లకు పనిచేసే నేచర్ వున్నవాడినని తనకు తానే చెప్పుకున్న కుర్రాడి పాత్రలో సిద్దూ పక్కాగా సరిపోయాడు. ఇటీవల వస్తున్న యూత్ స్టార్స్ ల జాబితాలో మరో పేరు చేరినట్లు అయింది. 

సినిమా హాట్ హాట్ గా వుంటుందని ఒకటి రెండు సీన్లు స్పష్టం చేసాయి. కృష్ణ అండ్ హిజ్ లీల కు వర్క్ చేసిన విమల్ కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ మంచి బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నట్లు టీజర్ నిర్మాణ విలువలు కనిపిస్తున్నాయి. ఫొటోగ్రఫీ బాగుంది.