భీష్మ రిలీజ్ ప్రకటన వచ్చేసింది

నితిన్-రష్మిక-వెంకీ కుడుమల క్రేజీ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా భీష్మ. ఈ సినిమా దాదాపు 70శాతం పూర్తయింది. అందుకే ఇప్పుడు విడుదల డేట్ ను అధికారికంగా ప్రకటించేసారు. కచ్చితంగా డేట్ ప్రకటించలేదు కానీ, 2019…

నితిన్-రష్మిక-వెంకీ కుడుమల క్రేజీ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా భీష్మ. ఈ సినిమా దాదాపు 70శాతం పూర్తయింది. అందుకే ఇప్పుడు విడుదల డేట్ ను అధికారికంగా ప్రకటించేసారు. కచ్చితంగా డేట్ ప్రకటించలేదు కానీ, 2019 క్రిస్మస్ కు అంటూ హింట్ ఇచ్చారు.

క్రిస్మస్ కు ఈసారి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. కానీ అధికారికంగా ఎవ్వరూ ప్రకటించలేదు. ఆ విధంగా భీష్మ ముందుగా రుమాలు వేసింది. అయితే క్రిస్మస్ ఈసారి బుధవారం వచ్చింది. అందువల్ల ముందువారం అయిన డిసెంబర్ 20 శుక్రవారం వేస్తారా? లేక లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది అని 25న వేస్తారా? అన్నది చూడాలి.

ఈ 25 డేట్ మీద శర్వానంద్-సమంతల 96 సినిమా నిర్మాత దిల్ రాజు కన్నువుంది. ఎవరి సినిమా అయినా ఆయన డిస్ట్రిబ్యూషన్ హ్యాండ్ వుంటుంది కాబట్టి, ఈ డేట్ కు ఎవరినన్నా రానిస్తారా? అన్నది చూడాలి. అలా అయితే భీష్మ డిసెంబర్ 20కే రావాల్సి వుంటుంది. ప్రస్తుతానికి అయితే క్రిస్మస్ కు అంటూ ప్రకటించారు. డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో?

అమరావతిలో భూములు కొన్న నేతల హడల్!