భుజాలు తడుముకుంటున్న విజయ్

సినిమా విడుదలైన తరవాత హీరో కానీ దర్శకుడు కానీ, నిర్మాత కానీ మీడియా ముందుకు రాలేదు. నిర్మాత పైకి ఏమీ అనకపోయినా, సన్నిహితుల దగ్గర సినిమా ఎలా ఫెయిల్ అయిందీ, ఎవరు కారణం అన్నది…

సినిమా విడుదలైన తరవాత హీరో కానీ దర్శకుడు కానీ, నిర్మాత కానీ మీడియా ముందుకు రాలేదు. నిర్మాత పైకి ఏమీ అనకపోయినా, సన్నిహితుల దగ్గర సినిమా ఎలా ఫెయిల్ అయిందీ, ఎవరు కారణం అన్నది ఏకరవు పెట్టి, బాధపడుతున్నట్లు ఇండస్ట్రీలో గ్యాసిప్ లు చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు అయితే ఈ సినిమా కారణంగా తన కెరీర్ క్రాస్ రోడ్స్ లోకి వచ్చి ఆగిందని ఫీలవుతున్నట్లు బోగట్టా. కానీ పైకి ఎవ్వరూ ఎక్కడా పెదవి విప్పలేదు. 

ఇలాంటి నేపథ్యంలో పైకి బాహాటంగా ఎవ్వరూ చెప్పకపోయినా, విజయ్ దేవరకొండ సినిమాను కెలికారు అని గ్యాసిప్ లు మాత్రమే వినిపిస్తుంటే, ఇవన్నీ అబద్దం అంటూ స్వయంగా ఖండించడం ఏమిటొ? ఆ ఖండన కూడా ఒపెన్ లెటర్ మాదిరిగానో, ప్రెస్ నోట్ మాదిరిగానో ఇవ్వకుండా, సైలంట్ గా విడుదల చేసామా? లేదా అన్నట్లు ఇవ్వడం ఏమిటో?

నిజానికి సినిమా విడుదలకు ముందే డైరక్టర్ ను పక్కన పెట్టేసినట్లు కనిపించింది. ఏ ప్రచార కార్యక్రమంలో కూడా పాపం డైరక్టర్ క్రాంతి మాధవ్ కనిపించలేదు. పైగా విజయ్ కూడా డైరక్టర్ గురించి చాలా తక్కువ అది కూడా ఆచి తూచి మాట్లాడారు. అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. డైరక్టర్ ఎక్కడా కనిపించడం లేదు, ఏదో విషయం వుండే వుంటుంది అని. 

నిజానికి విజయ్ ఇవ్వాల్సింది ఖండన కాదు. ఆలోచించాలి.  డిజాస్టర్ అవుతున్న ప్రతి సినిమా విషయంలో విజయ్ మీద ఇవే తరహా గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది. చాలా మంది హీరోలకు డిజాస్టర్లు వున్నాయి. కానీ వాళ్ల మీద ఇలాంటి గ్యాసిప్ లు రావడం లేదుగా. అది ముందు ఆలోచించాలి. ఎందుకు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు పలకరిస్తున్నాయి. ప్రామిసింగ్ గా ప్రారంభమైన ప్రాజెక్టులు ఎందుకు డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. 

ఓ ఖండన ఇచ్చేసినంత మాత్రాన జనంలో డిస్కషన్ రూపంలో నలుగుతున్న ప్రచారం మాసిపోదు. విజయ్ ఈ దిశగా ఆలోచించాలి.

నితిన్ కి వాళ్ళ అన్న పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఇమ్మన్నాడు