`హిట్` ట్రయిలర్ విడుదల

హీరో నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న సినిమా హిట్. విశ్వక్ సేన్ హీరో. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. …

హీరో నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న సినిమా హిట్. విశ్వక్ సేన్ హీరో. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.  ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా  నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “ముందుగా నాని గురించి చెప్పుకోవాలి. త‌ను హీరోగా బిజీగా ఉన్న‌ప్ప‌టికీ నిర్మాత‌గా మారి తొలి చిత్రంగా అ! వంటి డిఫ‌రెంట్ మూవీని అందించాడు. నిర్మాత‌లు నాని, ప్ర‌శాంతికి అభినంద‌న‌లు. విశ్వక్ సేన్  ఫ‌ల‌క్‌నుమాదాస్‌ను డైరెక్ట్ చేసి, నిర్మించి, న‌టించి పెద్ద హిట్ కొట్టాడు. 

హీరో విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ – “సాధార‌ణంగా ఓ సినిమా హిట్ అయితే నెక్ట్స్ మూవీ ఏంట‌నేది ఓ టెన్ష‌న్ ఉంటుంది. శైలేష్ ఈ సినిమా క‌థ చెప్ప‌గానే మ‌రేం ఆలోచించ‌కుండా సినిమా చేయ‌కుండా ఓకే చేసేశాను. నిర్మాత ప్ర‌శాంతికి థ్యాంక్స్‌.  సినిమా థియేట‌ర్‌కొస్తే మామూలుగా ఉండ‌దు. ఇంత మంచి డైరెక్ట‌ర్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది“ అన్నారు. 

డైరెక్ట‌ర్ శైలేంద్ర మాట్లాడుతూ – “ట్రైల‌ర్  అంద‌రికీ న‌చ్చి ఉంటుంద‌ని అనుకుంటున్నాను. థ్రిల్ల‌ర్ మూవీ. ట్రైల‌ర్‌లో చూసిన దానికంటే సినిమాలో ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ చేస్తారు. ఫ‌స్ట్ నుండి లాస్ట్ వ‌ర‌కు ఆడియ‌న్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చునిపెట్టే థ్రిల్ల‌ర్‌. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు నాని, ప్ర‌శాంతికి, మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన దిల్‌రాజుకి థాంక్స్‌“ అన్నారు.