బిగ్ బాస్ 3కి బండ్ల నో?

బిగ్ బాస్ 3కి సన్నాహాలు జరుగుతున్నాయి. హోస్ట్ గా కింగ్ నాగార్జున ఫిక్స్ అయిపోయారు. దాంతో పార్టిసిపెంట్ల కోసం వేట మొదలయింది. కాస్త క్రేజీ హౌస్ మేట్స్ కోసం నిర్వాహకులు వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది.…

బిగ్ బాస్ 3కి సన్నాహాలు జరుగుతున్నాయి. హోస్ట్ గా కింగ్ నాగార్జున ఫిక్స్ అయిపోయారు. దాంతో పార్టిసిపెంట్ల కోసం వేట మొదలయింది. కాస్త క్రేజీ హౌస్ మేట్స్ కోసం నిర్వాహకులు వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణుదేశాయ్ పేరు కొంతకాలంగా వినిపిస్తోంది. ఆమె దాదాపు ఒకె అన్నట్లు బోగట్టా.

యూట్యూబ్ లో పొలిటికల్ ఎంటర్ టైనర్లుగా పేరు తెచ్చుకున్న కెఎ పాల్, బండ్ల గణేష్ లను కూడా నిర్వాహకులు సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే బండ్ల చిత్రమైన కండిషన్ పెట్టి, నో చెప్పినట్లు తెలుస్తోంది. తనకు వీలయినంత వరకు ఫోన్ అందుబాటులో వుండాలని, కుటుంబ సభ్యలతో టచ్ లో వుండే అవకాశం వుండాలని బండ్ల గణేష్ కోరినట్లు తెలుస్తొంది. కేఎ పాల్ అయితే అందుబాటులో లేరు.

సినిమాల నుంచి పూర్తిగా కనుమరుగైన హీరో తొట్టెంపూడి వేణును కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లు తెలుస్తోంది. సినిమా ఫంక్షన్లలో కనిపించే మీడియం రేంజ్ యాంకర్లు ఒకరిద్దరిని కూడా సంప్రదించినట్లు బోగట్టా.

వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్