Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కళ్యాణ్ రామ్ తో మెహరీన్

కళ్యాణ్ రామ్ తో మెహరీన్

ఎఫ్ 2తో హనీ ఈజ్ ద బెస్ట్ అనిపించుకున్న మెహరీన్ చాలా సెలక్టివ్ గా సినిమాలు ఓకె చేస్తోంది. పంజాబీ సినిమా చేస్తూనే తెలుగులో రెండు సినిమాలు ఓకె చేసింది. అందులో ఒకటి నందమూరి హీరో పక్కన కావడం విశేషం.

118 సక్సెస్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ చేయబోయే సినిమాకు మెహరీన్ ను నాయికగా తీసుకున్నారు. ఈ సినిమాను శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం లాంటి ఫ్యామిలీ సినిమాల డైరక్టర్ సతీష్ వేగెశ్న అందిస్తున్నారు. సతీష్ బలం ఫ్యామిలీ సినిమాలే. అయితే కళ్యాణ్ రామ్ కోసం ఆయన ఫ్యామిలీ సబ్జెక్ట్ లోనే కొద్దిగా యాక్షన్ టచ్ తో స్క్రిప్ట్ తయారుచేసినట్లు తెలిసింది.

సతీష్ సినిమాల్లో హీరోయిన్లకు కూడా కాస్త మంచి పాత్రలే వుంటాయి. ఈ సినిమాలో కూడా కాస్త ఫ్రయారిటీ వున్న హీరోయిన్ పాత్రను తయారు చేసారని, దానికి మెహరీన్ ను ఎంపిక చేసారని తెలుస్తోంది. మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 లాంటి హిట్ లు మెహరీన్ కు వున్నాయి.

వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?