బిగ్ బాస్ కోసం చార్టర్ ఫ్లయిట్?

బిగ్ బాస్ 4 గేమ్ షో చాలా సీరియస్ గా సాగుతోంది. ఇలాంటి టైమ్ లో ఈ షో ను కీలకంగా,యాక్టివ్ గా నిర్వహిస్తున్న హీరో నాగార్జున కు ఓ చిక్కు సమస్య వచ్చింది.…

బిగ్ బాస్ 4 గేమ్ షో చాలా సీరియస్ గా సాగుతోంది. ఇలాంటి టైమ్ లో ఈ షో ను కీలకంగా,యాక్టివ్ గా నిర్వహిస్తున్న హీరో నాగార్జున కు ఓ చిక్కు సమస్య వచ్చింది.

అటు చూస్తే వైల్డ్ డాగ్ షో, ఇటు చూస్తే బిగ్ బాస్ షో. అదీ సమస్య. వైల్డ్ డాగ్ సినిమా కొసం ఒక పది రోజులు అవుట్ డోర్ కు వెళ్లి రావాల్సి వుంది నాగ్. 

అది ఎక్కడికి అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. హిమాచల్ ప్ర‌దేశ్ లేదా అస్సాం ఏరియాలో షూటింగ్ ప్లాన్ చేసే ఆలోచనలో వున్నారు. అందువల్ల ఓ వీకెండ్ బిగ్ బాస్ షో కు డుమ్మా కొట్టాల్సిన పరిస్థితి. ఈ ఒక్క వారం కోసం మరెవరినైనా రప్పించాలి. కానీ అలా చేయడం ఇష్టం లేదు ఇటు నిర్వాహకులకు, అటు నాగ్ కు కూడా.

అందుకే ఆల్టర్ నేటివ్ ప్లాన్ వేస్తున్నారు. ఇండియాలో ఎక్కడ షూట్ అయినా అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చి, బిగ్ బాస్ షో లో పాల్గొని వెళ్లేలా సమాలోచనలు సాగిస్తున్నారు.

ఈ ఖర్చు మరి బిగ్ బాస్ ఖాతాలో వేస్తారో? వైల్డ్ డాగ్ ఖాతాలో వేస్తారో అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి వుంది.

వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి