Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బయోపిక్ డైరక్టర్ బాలయ్యేనా?

బయోపిక్ డైరక్టర్ బాలయ్యేనా?

ఎన్టీఆర్ బయోపిక్ కు డైరక్టర్ కావలెను. అవును. ఇప్పుడు అదే ఇండస్ట్రీలో ఓ డిస్కషన్ పాయింట్. వారం రోజుల మల్ల గుల్లాల తరువాత దర్శకుడు తేజ తప్పుకున్నాడు. క్రిష్ ను అడుగుతున్నారు కానీ ఆయన ఎస్ ఆర్ నో అనడం లేదు. రాఘవేంద్రరావు ఆఖరి ఆప్షన్ అని వినిపిస్తోంది. కానీ ఆయన కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ అని వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ కావడానికి రాఘవేంధ్రరావు అంత సుముఖంగా లేరని వినికిడి.

ఇక మిగిలిన ఏకైక ఆప్షన్ బాలయ్య బాబే. ఆ దిశగానే సినిమా ముందుకు వెళ్తోందని తెలుస్తోంది. అసిస్టెంట్ లు, అసోసియేట్ లు, అలాగే సింగీతం లాంటి సీనియర్ల సలహాతో బాలయ్యే డైరక్ట్ చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే బాలయ్య అవకాశం ఇస్తే, బయోపిక్ చేయాలని దర్శకుడు వైవిఎస్ చౌదరికి ఆలోచన వుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే బాలయ్య ఈ విషయంలో ఏ మేరకు సుముఖంగా వున్నారో తెలియదు. అందువల్ల బాలయ్యే ఫైనల్ గా డైరక్టర్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ముహుర్తం షాట్ కు బాలయ్యే డైరక్ట్ చేసుకున్నారు. ఏ ముహుర్తాన ఆయన డైరక్షన్ కు శ్రీకారం చుట్టారో అదే ఫిక్స్ అయిపోయేలా వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?