బయోపిక్-అమ్మకాల్లో నాన్ బాహుబలి

ఎన్టీఆర్ బయోపిక్ కు నిర్మాతలు చెబుతున్న రేట్లు సంచలనంగా వున్నాయి. ఆ సినిమా ఆంధ్ర ఏరియాకు 30 నుంచి 32 కోట్ల రేషియోలో చెబుతున్న సంగతి తెలిసిందే. నెల్లూరు ఏరియాకు మూడుకోట్లు  చెబుతున్నారట. దీంతో…

ఎన్టీఆర్ బయోపిక్ కు నిర్మాతలు చెబుతున్న రేట్లు సంచలనంగా వున్నాయి. ఆ సినిమా ఆంధ్ర ఏరియాకు 30 నుంచి 32 కోట్ల రేషియోలో చెబుతున్న సంగతి తెలిసిందే. నెల్లూరు ఏరియాకు మూడుకోట్లు  చెబుతున్నారట. దీంతో బయ్యర్లు ముందువెనుక ఆడుతున్నారు.

నెల్లూరు బాక్సాఫీస్ హిస్టరీలో మూడుకోట్లు దాటిన సినిమా గట్టిగా అరడజను కూడా లేవు. బాహుబలిని వదిలేస్తే మగధీర, ఖైదీ నెంబర్ 150, రంగస్థలం మాత్రమే మూడుకోట్లు దాటిన షేర్ ను కళ్లచూసాయి. ఎంత పెద్ద సినిమా అయినా కోటి, కోటిన్నరే. నాని-నాగ్ ల దేవదాస్ కూడా నెల్లూరు ఏరియాకు కోటి పదిలక్షల రిటర్నబుల్ అడ్వాన్స్ మీద ఇచ్చారు.

అలాంటిది ఎన్టీఆర్ బయోపిక్ మూడుకోట్లు అనే సరికి బయ్యర్లు షాక్ అవుతున్నారు. పైగా సంక్రాంతికి బయోపిక్ సోలోగా రావడంలేదు. అటు రామ్ చరణ్-బోయపాటి, ఇటు అనిల్ రావిపూడి-వెంకీ-వరుణ్ తేజ్ సినిమాలతో కలిపి వస్తోంది.

ఇదిలా వుండగా నైజాం ఏరియాలకు ఏషియన్ సునీల్ తో డిస్కషన్లు జరుగుతున్నాయి. బయోపిక్ కు నైజాం ఏరియా 16కోట్ల కోట్ చేస్తున్నారట. మరి ఎక్కడ తెగుతుందో చూడాలి. మొత్తంమీద చూసుకుంటే బయోపిక్ అమ్మకాలు పూర్తయిపోతే, అమ్మకాల్లో నాన్ బాహుబలి రికార్డులు అన్నీ బయోపిక్ స్వంతం అయ్యేలా కనిపిస్తోంది వ్యవహారం.