సవ్యసాచి వెనక్కు.. రవితేజ ముందుకు?

సవ్యసాచి సినిమా ఈ ఏడాది ఆరంభంలో రెడీ కావాల్సిన సినిమా అలా అలా వెనక్కు జరుగుతూ ఆగస్టుకు చేరుకుంది. కానీ అప్పటికీ పూర్తికాలేదు. ఆఖరికి సెప్టెంబర్ చివరకు వచ్చేసరికి షూటింగ్ పూర్తయింది అనిపించుకుంది. ఇక…

సవ్యసాచి సినిమా ఈ ఏడాది ఆరంభంలో రెడీ కావాల్సిన సినిమా అలా అలా వెనక్కు జరుగుతూ ఆగస్టుకు చేరుకుంది. కానీ అప్పటికీ పూర్తికాలేదు. ఆఖరికి సెప్టెంబర్ చివరకు వచ్చేసరికి షూటింగ్ పూర్తయింది అనిపించుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదల చేయాల్సివుంది. నవంబర్ 2ను డేట్ గా ఫిక్స్ చేసుకున్నారు.

సవ్యసాచి నిర్మిస్తున్న మైత్రీమూవీస్ నే రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్ లో అమర్-అక్బర్-ఆంథోని సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ అయిదున విడుదల అనుకున్నారు. కానీ పనులు అనుకున్నంతగా కాకపోవడం, అక్టోబర్ అయిదున కాస్త ఇబ్బందికర పరిస్థితులు వుండడంతో వాయిదా వేసారు.

ఇప్పుడు సవ్యసాచి నవంబర్ లో విడుదల చేస్తే, రవితేజ సినిమా డిసెంబర్ లో చేయాలి. కానీ మైత్రీ మూవీమేకర్స్ అమర్ అక్బర్ ఆంథోనిని నవంబర్ లో సవ్యసాచి డేట్ కు తెచ్చి, సవ్యసాచిని డిసెంబర్ కు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారని వినిపిస్తోంది. ఇటీవల నాగచైతన్య సినిమా ఆశించినంత హిట్ కాకపోవడంతో కూడా చైతూ సినిమాకు గ్యాప్ ఇచ్చినట్లు అవుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరోపక్క సవ్యసాచిని అనుకున్న డేట్ కు తీసుకువచ్చి, పది హేను రోజుల గ్యాప్ లో అమర్ అక్బర్ ఆంథోని నవంబర్ లోనే విడుదల చేసే ఆలోచన కూడా వుంటుందని తెలుస్తోంది.