బయోపిక్ లో ఆ స్టార్ హీరోయిన్

ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారాలు ఒక్కోటీ మారిపోతున్నాయి. క్రిష్ వచ్చి స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటీ మారుస్తున్నారు. కొత్త అట్రాక్షన్లు జోడిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య కాకుండా రానా విద్యాబాలన్ కీర్తి సురేష్, మోహన్ బాబు…

ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారాలు ఒక్కోటీ మారిపోతున్నాయి. క్రిష్ వచ్చి స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటీ మారుస్తున్నారు. కొత్త అట్రాక్షన్లు జోడిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య కాకుండా రానా విద్యాబాలన్ కీర్తి సురేష్, మోహన్ బాబు లాంటి క్రేజీ నటులు ఈ ప్రాజెక్టు యాడ్ అయ్యారు. కళ్యాణ్ రామ్ కూడా యాడ్ అవుతారని టాక్ వుంది. 

ఇలాంటి టైమ్ లో మరో విషయం తెలిసింది. యంగ్ హీరోయిన్లలో మంచి క్రేజ్ వున్న రకుల్ ప్రీత్ సింగ్ బయోపిక్ లో కనిపించబోతోంది. సినిమాలో సందర్భానుసారం వచ్చే ఓ పాటలో ఆమె కనిపిస్తుంది. అయితే అది ఏ పాట, ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ఏ పాట కు ఆమె నర్తించబోతోంది అన్నది ఇంకా సీక్రెట్ గానే వుంచారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నది మాత్రం పక్కా. ఇంకా మరి కొందరు కూడా కనిపిస్తారు. అవన్నీ కలిపితే సినిమాకు భారీ బజ్ ఖాయం.

ఇదిలా వుంటే మోక్షజ్ఞ నటిస్తాడా? నటించడా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. ప్రస్తుతం ఫిజికల్ ఫిట్ నెస్ పనిమీద సింగపూర్ వెళ్లాడు మోక్షజ్ఞ.  అక్కడ నుంచి ఎప్పుడు వచ్చేది అన్నదాని మీద క్లారిటీ లేదు. సో, అందువల్ల మోక్షజ్ఞ బయోపిక్ లో కనిపంచడం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కనిపించకుండా వుండడానికే ఎక్కువ అవకాశం వుంది.

ఇది కాక ఇంకా చాలా  విశేషాలు వున్నాయి. అయితే అన్నీ ఒకే రోజు తెలుసుకుంటే అంత కిక్ వుండదు. మరో విశేషం రేపు.