ఏపీలో పవన్… తెలంగాణలో బన్నీ?

సంధ్య థియేటర్ వివాదం, హీరో అల్లు అర్జున్ డిఫెన్స్, పోలీసుల వివరణ అన్నీ కలిసి పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నట్లు క్లారిటీగా కనిపిస్తోంది.

సంధ్య థియేటర్ వివాదం, హీరో అల్లు అర్జున్ డిఫెన్స్, పోలీసుల వివరణ అన్నీ కలిసి పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నట్లు క్లారిటీగా కనిపిస్తోంది. అసలు ముందుగా ఈ వ్యవహారంలో ఎంటర్ అయిన భారతీయ రాష్ట్ర సమితి సైలంట్ అయింది. తాము రెస్పాండ్ కావడం వల్ల అల్లు అర్జున్ కు ఇబ్బందే తప్ప, కలిసి వచ్చేది వుండదని ఆ పార్టీ పెద్దలు గ్రహించారు. ఇలాంటి టైమ్ లో కాంగ్రెస్ తో పాటు ఎంఐఎం కూడా గొంతు కలపడం అన్నది వేరే రూట్ కు దారితీసింది. భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది. అల్లు అర్జున్ కు మద్దతుగా ఆ పార్టీ నేతలు మాట్లాడడం ప్రారంభించేసారు.

అంటే ఇక కాంగ్రెస్ వెర్సస్ భాజపా అన్న పంతానికి దారితీస్తోంది. పోలీసులు బన్నీ బెయిల్ క్యాన్సిల్ చేయించే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం టోటల్ సిసి టీవీ ఫుటేజ్ ను బయటకు తీసారు. మీడియా ముందు పెట్టారు. ఇప్పుడు ఈ కేసు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కే అవకాశం క్లారిటీగా కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో బన్నీకి అండగా వుండేది భాజపా మాత్రమే.

మెగా హీరో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఏపీలో భాజపా కూటమిలో వున్నారు. భాజపాకు గట్టి మద్దతుదారుగా వున్నారు. జనసేన పార్టీపెట్టినా, దాన్ని మొదటి నుంచీ భాజపాకు అండగానే వుంచుతున్నారు. ఒక్క 2019 ఎన్నికల్లో మాత్రమే భాజపాతో విబేధించారు. ఇప్పుడు భాజపాకు వీర విధేయుడిగా వున్నారు పవన్.

తెలంగాణలో ఇలాంటి బలమైన మాస్ జనాల అట్రాక్షన్ లేదు భాజపాకు. ఇప్పుడు బన్నీని కనుక తమ వైపు తిప్పుకుంటే అది పార్టీకి ఉపయోగపడుతుంది. బన్నీ మామగారు రాజకీయ నాయకుడే. కాంగ్రెస్ లో వున్నారు. అందువల్ల ఇప్పటి నుంచి చాలా దూరదృష్టితో భాజపా నాయకులు పావులు కదుపుతున్నారు అనుకోవాల్సి వస్తోంది.

నేరుగా ప్రభుత్వాన్నే ఢీకొనాల్సి వస్తున్న ఈ నేపథ్యంలో బన్నీ కి కూడా భాజపా కేంద్ర పెద్దల మద్దతు చాలా అవసరం. అది వుంటేనే అతగాడు ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటకు రాగలడు.

మొత్తం మీద తెలంగాణ రాజకీయం రంజుగా మారుతోంది. సంధ్య థియేటర్ ఉదంతం రాజకీయ రంగు బాగా పులిమేసుకుంది.

12 Replies to “ఏపీలో పవన్… తెలంగాణలో బన్నీ?”

  1. అల్లు అర్జున్ కి కోర్టులో శిక్ష పడకపోవచ్చు కానీ మందలించే అవకాశం ఉండొచ్చు. పోలీసులు విడుదల చేసిన వీడియోల వల్ల సమాజంలో అల్లు అర్జున్ పరువు పోయింది. ఇప్పుడు ఈ విషయంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా అల్లు అర్జున్ కి సపోర్ట్ గా తల దురిస్తే ఆ పార్టీకి జరిగే లాభం కన్నా నష్టమే జరిగే అవకాశం ఎక్కువ ఉంది.

  2. Bunny నీకు ఒక దేశానికి ఉన్నట్టు, ఏకంగా నీకు ఆర్మీ నే ఉంది కదా

    So

    నీ ఆటిట్యూడ్ ఏమాత్రం తగ్గొద్దు రా బన్నీ..

    A1 సింహం and రకుల్ రావు మన పక్కే..

    నిన్ను “పుష్ పా” అనుకుంటున్నారు.. కాదు “WILD FIRE” అని నిరూపించు రా ద’మ్ముంటే..

    అవతల ఎవ్వడైనా

    నీయవ్వ తగ్గేదే లే..అనాలి లేకపోతే నువ్వు కేవలం “రేవంత్ నలిపిన ఫ్లవరు” ఐతావ్

      1. ఒ రే య్ బ్రో క ర్ కు క్క. ….. ఇ లా. మొ రి గ్గే. ప్ర జ లు అం ద రూ

        అ త్తు లు స్టా ర్ పై. ఉ మే స్తు న్నా రు

  3. “పుష్పా అంటే రేవంత్ నలిపిన “ఫ్లవరు” అనిపించుకుంటాడా??

    లేక

    “నీయవ్వ తగ్గేదేలే” అంటూ

    “WILD FIRE” అని నిరూపించుకుంటాడా??..

  4. ఆడికి పూర్తిగా కొవ్వు పట్టేసింది, జగన్ రెడ్డి కన్నా లక్ష రెట్లు ఎక్కువ కొవ్వు పట్టేసింది,ఆడేదో తెలుగు సినిమా చరిత్రలో సూపర్ మ్యాన్ అనుకుంటున్నాడు, వాడు అన్ స్టాపబుల్ లో ఎంత అహంకారం తో మాట్లాడేడంటే, వాడికి వాడే పోటీ అంట, వాడితో పోటీపడే స్థాయి ఎవడికీ లేదంట

  5. ఆడికి పూర్తిగా కొ వ్వు పట్టేసింది, జగన్ కన్నా లక్ష రెట్లు ఎక్కువ కొ వ్వు పట్టేసింది,ఆడేదో తెలుగు సినిమా చరిత్రలో సూపర్ మ్యాన్ అనుకుంటున్నాడు, వాడు అన్ స్టాపబుల్ లో ఎంత అహంకారం తో మాట్లాడేడంటే, వాడికి వాడే పోటీ అంట, వాడితో పోటీపడే స్థాయి ఎవడికీ లేదంట!

  6. అడవిని నరికేసే కథ తో సినిమాతీసి అహంకారం తలక్కితే నే ఈ level లొ  అడవి తల్లి … తగ్గేదేలే..అంటూ తెగ్గొట్టేసిందిలే 

Comments are closed.