తెరమీద చూసేదంతా మాయే. కనిపించే హీరోలు, హీరోయిన్ల రంగు, ఒంపు సొంపులు, ఒకటేమిటి సమస్తం మాయే. అందులోనూ డిజిటల్ కరెక్షన్ వచ్చిన తరువాత నల్లగా వున్న వాళ్లు కూడా తెరమీద మాంచి రంగుతో మిల మిల మెరిసిపోతుంటారు. అలాగే మొహం ఉబ్బిపోయినా, ముడతలు వచ్చినా, బాడీ బ్యాడ్ షేప్ అయిపోయినా కూడా కోట్లు కుమ్మరిస్తే తెరమీద ఓకె.
లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న గ్యాసిప్ ప్రకారం ఓ పెద్ద హీరో ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాలో బాడీ షేపింగ్, ఫేస్ కరెక్షన్ కే 10 కోట్లు ఖర్చు అవుతున్నాయని తెలుస్తోంది. పైగా అందుకే సినిమా నిర్మాణం కూడా ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.
మరీ పెద్దగా వయసు అయిపోకపోయినా, ఈ హీరో బాడీ మాత్రం షేప్ అవుట్ అయిందని ఇటీవల బయట ఆయనను చూసిన వాళ్లంతా అనుకుంటున్నారు. ఫేస్ కూడా బాగా ఉబ్బిపోయిందని టాక్ వుంది.
నిజానికి ఆ ఫేస్ తో, ఆ బాడీతో సినిమాలో కనిపిస్తే ఇంకేమైనా వుందా? కొంప కొల్లేరు అయిపోతుంది. అందుకే డిజిటల్ కరెక్షన్ ను నమ్ముకున్నారు. బాలీవుడ్ లో ఫిట్ గా వున్న హీరోల ఫేస్ కరెక్షన్, చేతుల కరెక్షన్ చేస్తేనే మూడు కోట్ల వరకు అవుతుంది. తెలుగులో కొన్నాళ్ల క్రితం పరమ డిజాస్టర్ అయిన ఓ కలర్ ఫుల్ సినిమాలో హీరోను కరెక్షన్ చేయడానికే అప్పట్లో కోటి రూపాయలు ఖర్చు చేసారు.
ఖర్చులు పెరిగాయి.రోజులు మారాయి. ఫేస్ మారుతోంది. బాడీ షేప్ అవుట్ అవుతోంది. మరి పది కోట్లు ఖర్చు అవుతాయంటే నమ్మాల్సిందే.