ఒకటి కాదు రెండూ కాదు పోర్న్ స్టార్ సన్నీలియోన్ బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన దగ్గర నుంచి ఆమెపై రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమె నటించిన కండోమ్ యాడ్ కారణంగా రేప్‌లు జరుగుతున్నాయంటూ ఒక రాజకీయనేత సైతం దుయ్యబట్టారు. దీంతో బాగా ఒళ్లు మండినట్టుంది సన్నీ హాట్ హాట్‌గా స్పందించింది.
అధికారంలో ఉన్నవాళ్ళు సహాయం అవసరమైన వారికి చేయూతని ఇవ్వడంలో బిజీగా ఉండాలి అంతే తప్ప నా మీద కామెంట్స్ పాస్ చేయడం ద్వారా టైమ్ పాస్ చేయడం ఏమిటంటూ ఆమె ఆగ్రహంగా ప్రశ్నించింది. పనిలో పనిగా గతంలో తను తా చెడ్డ కోతిలా మిగిలిన హీరోయిన్లు కూడా సినిమాల్లో వల్గర్ సీన్లు చేయడానికి కారణమవుతున్నానంటూ రాఖీసావంత్ అన్న మాటల్ని, సెలీనాజైట్లీ చేసిన విమర్శల్ని ఆమె తిప్పికొట్టింది. అవన్నీ పసలేని, పనిలేని కామెంట్సనేసింది. ప్రొఫెషనలిజం లేని మాటలంది. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్లని ఎక్కడా చూడలేదని, అది వారి మానసిక సమస్య అని తేల్చేసింది.
పోర్న్ స్టార్ అంటే ప్రాస్టిట్యూట్ కాదంటూ తీవ్రంగా మండిపడింది. భారతదేశంలో అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ప్రత్యేకంగా లేదని కాబట్టే చాలా మందికి అసలు అదేంటో తెలియదని చెప్పింది. అందుకని తమను వ్యభిచారులుగా అనుకుంటున్నారని వాపోయింది. అమెరికాలో ఉండగా తాను అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పటి వీడియో క్లిప్స్ ఇప్పటికీ సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి తనను ఇంకా అలాగే జమకట్టడం భావ్యం కాదంది. భారత చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ తాను సదరు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యాననే విషయం గుర్తించాలని కోరింది.
గతాన్ని తవ్వుతూ ఇంకా తనను వేటాడడం సరైంది కాదని, తాను మారి, కొత్త పంధాలో ముందుకు వెళుతున్న విషయం పరిగణనలోకి ఎందుకు తీసుకోరని ఆవేదన వ్యక్తం చేసింది.నిజమే… సన్నీలియోన్ ఒకనాటి పోర్న్ స్టార్. అయితే ఆమె బిగ్‌బాస్ టివి షో ద్వారా పాప్యులర్ అయ్యే సమయంలోనే తాను అందరిలో ఒకరుగా రుజువు చేసుకుంది. ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవలసిన అంశం ఏమిటంటే.. సన్నీలియోన్ తాను పోర్న్‌స్టార్ అన్న విషయాన్ని దాచాలనే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. అసలు తను చెప్పకపోతే మనకి ఆ విషయం తెలిసేది కూడా కాదు.
ఇక హిందీ చిత్ర పరిశ్రమలోకి వచ్చాక ఆమె చేస్తున్న పాత్రలు, కమర్షియల్ యాడ్స్ అన్నీ ఇతర మన నటీమణులు, ఎంతో కాలంగా ఇక్కడి పరిశ్రమలో పాతుకుపోయి, అన్ని రకాలుగా బాగున్నవాళ్లు సైతం చేస్తున్నవేననే విషయాన్ని ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నవాళ్లు గుర్తించాలని సన్నీ సానుభూతి పరులు వాదిస్తున్నారు.