Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాయ్ ఫ్రెండ్ లు..అయినా రిలేషన్లు!

బాయ్ ఫ్రెండ్ లు..అయినా రిలేషన్లు!

టాలీవుడ్ లో కొంత మంది పరిస్థితి భలే చిత్రంగా వుంది. టీవీ ఇండస్ట్రీలో కావచ్చు, టాలీవుడ్ లో కావచ్చు. అవకాశాల కోసం కొంతమంది అయినా పాపం, కాంప్రమైజ్ అవుతుంటారు. ఇది తప్పదు. ఇదో పేద్ద డిస్కషన్ పాయింట్. 

ఇక్కడ ఒకటి రెండు లైన్లలో రాసేది కాదు. టీవీ సీరియళ్లలోనో, షో ల్లో నో ఎంట్రీ ఇచ్చి, అక్కడి నుంచి సినిమాల్లోకి రావాలనుకుంటారు. కానీ కొందరిని అదృష్టం వరిస్తుంది. సులువుగా అవకాశాలు దొరుకుతాయి. కానీ కొందరికి మాత్రం అలా కాదు. ఎవరో ఒకరి కన్ను వారి మీద పడుతుంది. అక్కడి నుంచి ఆ గాలానికి చిక్కాలి. అప్పుడే అవకాశాలు వుంటాయి.

ఇక్కడ గమ్మత్తేమిటంటే ఇలా చిక్కే చాలా మందికి అసలు సిసలు ప్రేమలు వేరే వుంటాయి. ఎప్పటికైనా కలిసి ట్రావెల్ చేద్దాం అనుకునే బాయ్ ఫ్రెండ్ లు వుంటారు. వారితో ప్రేమలు కొనసాగుతూనే వుంటాయి. మనసులో వారికే స్థానం వుంటుంది. ఎప్పటికైనా జీవితం పంచుకునేది వారితోనే. కానీ అవకాశాల కోసం కొంచెం అటు ఇటు చూసి కాంప్రమైజ్ అయ్యే వ్యవహారాలు మాత్రం తప్పడం లేదు. ఇది కెరీర్ గ్రోత్ కోసం తప్పని అనుకుంటున్నారు తప్ప, తప్పుగా అనుకోవడం లేదు.

రంగుల కలలు నెరవేర్చుకోవడానికి, ఈ సినీ మాయా ప్రపంచంలో ఓ స్టేజ్ కు రావడానికి అందరూ కాదు కానీ, కొందరయినా కాంప్రమైజ్ కావడం అన్నది కామన్. ఇది బయటకు తెలియకపోయినా, లోలోపల గ్యాసిప్ లు చక్కర్లు కొడుతూనే వుంటాయి. ఇక్కడ పాపం కొంత మందికి ఇంకో సమస్య. తమ బాయ్ ఫ్రెండ్ లను పైకి తీసుకురావడానికి కూడా తాము ‘త్యాగాలు’ చేయాల్సి వస్తుంది.

ఇక్కడ ఎవరూ ఎవరినీ నిందించడానికి ఏమీ లేదు. అంతా ఇచ్చి పుచ్చుకునే ధోరణి. అందువల్ల మీటూ లు… కమిటీలు అలాంటి వాటి పరిథిలోకి ఇవి రావు. ఇవి వేరే…

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?