బోయపాటి-బాలయ్య కాంబినేషన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. బోయపాటి హిందీ రైట్స్ కోసం ఏకంగా సోనాక్షి సిన్హాను రంగంలోకి దింపుదాం అనుకున్నారు. కానీ గతంలో పవన్ సరసన అడిగితేనే నో అన్న సోనాక్షి, ఇప్పుడు బాలయ్య సరసన అంటే ఎస్ అనడం సాధ్యమా?
ఇదిలా వుంటే అసలు బాలయ్య కోసం సింహా, లెజెండ్ లాంటి పవర్ ఫుల్ సబ్జెక్ట్ లు రెడీ చేసిన బోయపాటి ఈసారి ఏం చేయబోతున్నారు అన్నది ప్రశ్న. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం బోయపాట ఈసారి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో కథ రెడీ చేసుకున్నారని, బాలయ్యకు రెండు మూడు గెటప్ లు వుంటాయని తెలుస్తోంది.
కథలో ముందు వెనుకలు మామూలే. కథకు డివోషనల్ టచ్ వుంటుదని తెలుస్తోంది. కత్తులు గొడ్డళ్లు లేకుండా సినిమా తీయని బోయపాటి డివోషనల్ టచ్ తో సినిమా తీయడం అంటే కాస్త నమ్మలేని విషయం. బోయపాటి ఏ విధంగా తన కథకు డివోషనల్ టచ్ ఇవ్వబోతున్నారో తెలియాల్సి వుంది. సుమారు 70 కోట్ల వ్యయంతో ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.