కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఏస్ డైరక్టర్ల సరసన చేరిపోయాడు బోయపాటి శ్రీనివాస్. ప్రస్తుతం చేస్తున్న రామ్ చరణ్ సినిమాకు నిర్మాత దానయ్య నుంచి 15కోట్ల రెమ్యూనిరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి జీఎస్టీ లేదా ఇతర టాక్స్ లు మాత్రం బోయపాటే కట్టుకోవాలి. అలాగే కొన్ని చిల్లర ఖర్చులు కూడా అందులోనే.
గతంలో పదికోట్ల రెమ్యూనిరేషన్ వరకు బోయపాటి అందుకున్న వైనం వుంది. 15కోట్లు అందుకోవడం ఇదే ప్రథమం. దర్శకుడు రాజమౌళిని పక్కన పెడితే, త్రివిక్రమ్, కొరటాల శివనే ఈ ఫీట్ సాధించారు. ఇప్పుడు మూడో డైరక్టర్ బోయపాటినే.
6 నుంచి సెట్ మీదకు
ఈ నెల 6నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో బోయపాటి శ్రీనివాస్-రామ్ చరణ్ సినిమా ఫుల్ స్వింగ్ షెడ్యూలు స్టార్ట్ అవుతుంది. ముందుగా యాక్షన్ ఎపిసోడ్ లు అక్కడ షూట్ చేస్తారు.
ఇందుకోసం గడ్డం తీసేసి కొత్త లుక్ లోకి రామ్ చరణ్ మారుతున్నాడు. సుమారు ఏణ్ణర్థం నుంచి ప్రభాస్ భాహుబలి గడ్డం మాదిరిగా, రామ్ చరణ్ రంగస్థలం గెడ్డం పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇక ఆ గడ్డం నుంచి విముక్తి అన్న మాట.