బ్రేకింగ్..క్రిష్ కు నో చెప్పిన పూజా

పూజా హెగ్డే..ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఆమే అనాలేమో? మిగిలిన వారు అంతా దాదాపు సైడ్ అయిపోయినట్లే. సమంత, అనుష్క లాంటి వాళ్లు వెరీ ఛూజీ అయిపోయారు. సో, హీరోలందరూ పూజాతో చేస్తున్నారు.…

పూజా హెగ్డే..ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఆమే అనాలేమో? మిగిలిన వారు అంతా దాదాపు సైడ్ అయిపోయినట్లే. సమంత, అనుష్క లాంటి వాళ్లు వెరీ ఛూజీ అయిపోయారు. సో, హీరోలందరూ పూజాతో చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కూడా పూజాను తీసుకోవాలనుకున్న దర్శకుడు క్రిష్ ఆసలు నీరుగారిపోయినట్లు తెలుస్తోంది.

పవర్ స్టార్ కోసం క్రిష్ ఓ రాబిన్ హుడ్ స్టోరీని రెడీ చేసిన సంగతి ఇప్పటికే బయటకు వచ్చింది. తెలంగాణలోని 'పండగల సాయన్న' అనే మరుగున పడిన వీరుడి గాథ ఆధారంగా క్రిష్ ఓ పీరియాడిక్ ఫిల్మ్ కు శ్రీకారం చుట్టారని వార్తలు వున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ను తీసుకోవాలనుకున్నారు. ఆమెను కలిసి నేరేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

కానీ కథ నచ్చకో, కథలో పాత్ర నచ్చకో పూజా హెగ్డే రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే పవన్ తో హరీష్ శంకర్ కూడా ఓ సినిమా చేయబోతున్నారు. అది ఇంకా టైమ్ పడుతుంది. పూజా అంటే హరీష్ శంకర్ కు లక్కీ హీరోయిన్. అందుకే ఆమెను తన సినిమాలో పవన్ కు హీరోయిన్ గా తీసుకుంటారని కూడా వినిపిస్తుంది. కానీ అదంతా చాలా దూరం వ్యవహారం. ప్రస్తుతానికి పూజా అయితే పవన్ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందన్నది హాట్ న్యూస్.

రాజమండ్రి లో 'దిశ' తొలి పోలీస్‌ స్టేషన్‌