రాజకీయాతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ తన మరియు పార్టీ అవసరాల కోసం తిరిగి సినిమాలు చేస్తున్నానని చెప్పాడు. క్లియర్‌గా డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నట్టు అంగీకరించిన పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళూ రాజకీయాలంటూ తిరిగి ఫిజికల్ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టలేదు. తిరిగి సినిమాలు చేయాలని డిసైడ్ అయినపుడు మళ్లీ షేప్‌లోకి వచ్చి చేస్తే మంచిదని అసలు ప్రయత్నించినట్టు లేదు.
రాజకీయాలలోకి ఎలాగైతే అండర్ ప్రిపేర్డ్‌గా వెళ్ళి దెబ్బ తిన్నాడో, తిరిగి సినిమాలలోకి వస్తూ కూడా పవన్ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు పాటించకుండానే షూటింగ్స్ మొదు పెట్టేసాడు. ఒక్క సినిమానే సజావుగా చేసిన దాఖలాలు లేని పవన్ ఏకంగా ఒకేసారి రెండు సినిమాలు, రెండు గెటప్‌లు అంటూ రంగంలోకి దిగిపోయాడు. క్రిష్ సినిమా కోసమని రెండేళ్ళుగా పెంచిన గడ్డం తొలగించిన పవన్ డబుల్ చిన్తో, జారిన చెంపలతో వయసుని అస్సలు దాచలేకపోతున్నాడు.
అరవై అయిదేళ్ల వయసులో ప్రతి సినిమాకి ముందు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై కేర్ తీసుకునే తన అన్నయ్య చిరంజీవి నుంచి పవన్ కాస్తయినా స్ఫూర్తి పొందినట్టు లేడు. యాభై రెండేళ్ల పవన్ కళ్యాణ్ మునుపటిలా యంగ్‌గా కనిపించడం కష్టమే కానీ తనవంతుగా కాస్తయినా ప్రిపరేషన్ చేసుకుని వస్తే బాగుండేదని అవుటాఫ్ షేప్‌లో కనిపిస్తోన్న పవన్‌ని చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఎంత డబ్బు కోసం సినిమాలు చేస్తున్నా కానీ అందుకు కూడా తగినంత ‘కసరత్తు’ అవసరమేగా మరి!