అదో పెద్ద సినిమా అనుకునే మిడ్ రేంజ్ సినిమా. ఎందుకంటే ఆ హీరోకి వరుసపెట్టి అరడజను ఫ్లాపులు. పైగా టాప్ హీరోల మాదిరిగా పెద్ద సినిమా అనే స్టేటస్ వచ్చే అవకాశం లేని సినిమా. ఈ సినిమాకు తెరకెక్కించే పని మొదలుపెట్టినపుడు చాలా మంది, వర్కవుట్ అవుతుందా అనుకున్నారు.
ఎందుకంటే 60 నుంచి 70 కోట్లలో తీసిన వాళ్లకే వర్కవుట్ కాలేదు. మార్కెటింగ్ కాలేదు. థియేటర్ ఆదాయం పెద్దగా రాలేదు అని లెక్కలు వినిపించారు. అయితే మాస్, యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ పండించగల దర్శకుడు 80 కోట్లలో తీసేస్తా, అస్సలు బడ్జెట్ దాటదు అన్నారట, పైగా కాంబినేషన్ మీద నమ్మకం వుంది అంటూ ముందుకు వెళ్లారు నిర్మాత.
కానీ ఇప్పుడు తీరా చేస్తే బడ్జెట్ 90 కోట్ల వరకు అయిపోతోందని లెక్కలు కనిపిస్తున్నాయట. పైగా ఇంకా పబ్లిసిటీ వుంది. సినిమా విడుదల నాటి వరకు కట్టాల్సిన వడ్డీలు వుంటాయి. ఇవన్నీ కలిసి ఎంత వరకు అవుతాయో తెలియదు.
పోనీ మార్కెటింగ్ అవుతుందని అనుకున్నా, ఎంత లెక్కలు కట్టినా థియేటర్ మీద నుంచి ముఫై కోట్ల మేరకు రావడమే అసాధ్యం. మరి నాన్ థియేటర్ ఏదో విధంగా డీల్స్ కుదుర్చుకున్నా 60 కోట్లు వస్తుందా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
ఇక మిగిలిన ఆశ ఒకటే.. సినిమా బ్లాక్ బస్టర్ అయితే కనుక ఓవర్ ఫ్లోస్ వస్తే, రికవరీ అవుతుందని. అది జరగాలనే ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పటికే ఆ హీరో తో ఇలాగే ముందు వెనుక చూడకుండా సినిమాలు తీసిన నిర్మాతలు చాలా మంది నష్టాలు మూటకట్టుకున్నారు.