బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న భారీ సిన్మాకు కూడా కరోనా ఎఫెక్ట్ తప్పలేదు. ఈ సినిమాకు ఎక్కువగా అటవీ నేపథ్యం వుంది. అందుకే కేరళ అడవులను లోకేషన్ గా ఎంచుకున్నారు. దర్శకుడు సుకుమార్, ఆయన టీమ్ అక్కడకు వెళ్లి, చాలా ప్రాంతాలు రెక్కీ చేసి, లొకేషన్లు ఫిక్స్ చేసారు. చిన్న చిన్న సెట్ లు కూడా ప్రిపేర్ చేసారు.
కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. కేరళలో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా వుండడంతో, షూటింగ్ లోకేషన్ ను కేరళ నుంచి ఆంధ్రలోని మారేడుమిల్లికి మార్చారు. ఈ నెల 20 నుంచి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభిస్తారు. మరీ కేరళలోని లొకేషన్స్ నే కావాలి అన్న సీన్లు వాయిదా వేసి, కరోనా ఎఫెక్ట్ తగ్గాక చిత్రీకరిస్తారు.
మారేడుమిల్లి అడవులతో అడ్జస్ట్ కావచ్చు అనే సీన్లు అన్నీ ఇక్కడ చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. బన్నీ ఈ సినిమాలో లారీ డ్రయివర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.