బన్నీ సినిమాపై బురదజల్లుడు

అల్లుఅర్జున్.. ఇటీవల కొంత కాలంగా వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్న హీరో. అదృష్టమో, దురదృష్టమో, వరుస సంఘటనలు అలా వచ్చాయి. సెట్ లో రగడ జరగడం, అతని కేరవాన్ కు ఫోలీసులు ఫైన్ వేయడం అలా…

అల్లుఅర్జున్.. ఇటీవల కొంత కాలంగా వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్న హీరో. అదృష్టమో, దురదృష్టమో, వరుస సంఘటనలు అలా వచ్చాయి. సెట్ లో రగడ జరగడం, అతని కేరవాన్ కు ఫోలీసులు ఫైన్ వేయడం అలా వరుసగా జరిగాయి. ఇదే సమయంలో, ఇదే అదనుగా బన్నీ మీద బురద జల్లే కార్యక్రమం ప్రారంభమైందని అతని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతికి మహేష్ బాబుబన్నీ సినిమాలు ఢీకొనడం పక్కా అని డిసైడ్ కావడంతో వచ్చింది సమస్య.

ఇప్పటి నుంచే బన్నీ సినిమాను బద్ నామ్ చేసే కార్యక్రమం స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఇది ఎంతదూరం వెళ్లిందంటే, బన్నీ సినిమా ఇంకా నలభైశాతం కూడా పూర్తి కాకుండానే, ఆ సినిమా 'బ్రహ్మోత్సవం' అయిపోతుందని ప్రచారం చేసేవరకు. సినిమా పూర్తయితే, ఇన్ సైడ్ టాక్ బయటకు వస్తే, అది బ్రహ్మోత్సవం అవుతుందో? మహర్షి అవుతుందో చెప్పవచ్చు. లేదా సెన్సారు పూర్తయితే, ఆ టాక్ ను తెలుసుకుంటే జోస్యం చెప్పవచ్చు.

అలా కాకుండా ఇంకా నలభైశాతం షూటింగ్ వుండగా ఇలాంటి టాక్ పుట్టించడం అంటే కేవలం బన్నీ మీద బురద వేయడం తప్ప వేరుకాదని ఫ్యాన్స్, బన్నీ టీమ్ ఫీలవుతున్నాయి. వాస్తవానికి ఏ హీరోకి అయినా ప్లానింగ్ తేడాకొట్టడం అన్నది కామన్. ఇలా చాలామంది టాప్ హీరోల పరిస్థితి కాస్త అటుగా ఒకసారి, ఇటుగా ఒకసారి అవుతుంటుంది. కచ్చితంగా సక్సెస్ కొట్టాలి అనే పరిస్థితి వుండడంతో, ఏ డైరక్టర్, ఏ కథ అన్న సమస్య మొదలవుతుంది. జడ్జిమెంట్ అంత సులువుకాదు. దాంతో లైనప్ దెబ్బతింటుంది.

చిరంజీవితోనే సినిమా తీయాలని కొరటాల శివ అనుకోవడంతో ఇన్ని నెలలుగా ఖాళీగా వుండిపోయారు. అలాగే త్రివిక్రమ్ తోనే సినిమా చేయాలని బన్నీ అనుకోవడంతో, సమస్య వచ్చింది. గత సెప్టెంబర్ లో త్రివిక్రమ్ సినిమా చేయాలన్న నిర్ణయం జరిగింది. ఆయన ఖాళీ అయి, కథ మీద కూర్చుని, దాన్ని రెడీ చేసి, షెడ్యూళ్లు వేసేసరికి ఆలస్యం అయింది.

వంద కోట్ల సినిమాకు ఇప్పుడు మూడే డేట్లు. సమ్మర్, దసరా, సంక్రాంతి. త్రివిక్రమ్-బన్నీ సినిమా సమ్మర్ కు కాస్త ముందు ప్రారంభమైంది. ఇక మిగిలింది దసరా-సంక్రాంతి. కానీ మెగాస్టార్ సైరా దసరాకు విడుదల అని ముందే ఫిక్స్ చేసారు. అలాంటపుడు బన్నీ దసరాకు ఎలా వస్తాడు? ఇక మిగిలింది. సంక్రాంతి. అందుకే ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నారు.

ఇక ఇంకో సమస్య ఏమిటంటే, బన్నీ సినిమాలో తమిళ, మలయాళ, హిందీ, తెలుగు నటులు అందరూ వున్నారు. వీళ్లందరి డేట్ లు సింక్ కావడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి నేపథ్యంలో, సినిమాను సంక్రాంతి దిశగా తయారుచేస్తుంటే, బన్నీని టార్గెట్ చెయడం సరికాదన్నది ఫ్యాన్స్ మాట.

డియర్ కామ్రేడ్.. విజయ్ జోక్యం నిజంగా ఉందా?

సినిమా రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌