‘కామ్రేడ్’ తొలిరోజు ఇలా

యూత్ లో భయంకరమైన క్రేజ్ వున్న హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా డియర్ కామ్రేడ్. శుక్రవారం విడుదలయిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. తొలిరోజు మంచి అంకెలు కనిపిస్తాయి అని…

యూత్ లో భయంకరమైన క్రేజ్ వున్న హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా డియర్ కామ్రేడ్. శుక్రవారం విడుదలయిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. తొలిరోజు మంచి అంకెలు కనిపిస్తాయి అని అనుకున్నట్లే, రీజనబుల్ ఫలితాలను నమోదు చేసింది ఈ సినిమా.

సినిమాను ఆంధ్ర 9 నుంచి 10 కోట్ల రేషియోలో విక్రయించారు. ఆ రేటుకు అనుగుణంగానే నైజాం ఏడున్నర కోట్లకు విక్రయిస్తే, దాన్ని మారుబేరానికి తొమ్మిది కోట్లకు మళ్లీ అమ్ముడుపోయింది. సీడెడ్ ను 3.60కి విక్రయించారు. ఇలా రీజనబుల్ రేట్లకు అమ్మడం అన్నది కొంత పనికి వస్తుంది అనుకోవాలి. శని, ఆదివారాలు గడిచిన తరువాత కానీ సినిమా భవితత్యం తెలియదు.

తొలిరోజు వసూళ్లు ఇలా వున్నాయి.
నైజాం…………2.73

సీడెడ్…………0.81
వైజాగ్…………0.89
ఈస్ట్…………..0.80
వెస్ట్……………0.53
కృష్ణ…………..0.38
గుంటూరు…….0.63
నెల్లూరు……….0.26

డియర్ కామ్రేడ్.. విజయ్ జోక్యం నిజంగా ఉందా?

సినిమా రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌